లెక్కలేత్తాండ్రు | Rationalization in Department of Education | Sakshi
Sakshi News home page

లెక్కలేత్తాండ్రు

Published Sat, Jul 16 2016 5:58 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

Rationalization in Department of Education

టీచర్లకు రేషనలైజేషన్ గండం 
వివరాల సేకరణలో విద్యా శాఖ
త్వరలో ఉపాధ్యాయులకు స్థానచలనం
 
ఖమ్మం : విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని.. అలా లేని పాఠశాలల వివరాలు.. విద్యార్థుల సంఖ్యకు మించి ఉన్న టీచర్ల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు.. జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ కోసం జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయుల సంఖ్యను లెక్కించడంతోపాటు ఎక్కువ  మంది టీచర్లు పనిచేస్తున్న పాఠశాలల వివరాలను కూడా సేకరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా.. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా.. పట్టణం, పరిసరాల్లో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ.. ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నట్లు అధికారులు సేకరించిన సమాచారం ద్వారా తెలిసింది. దీంతో మరోసారి వివరాలు సేకరించి.. తుది జాబితా అందజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 
 
142 మంది టీచర్లకు స్థానచలనం
సేకరిస్తున్న వివరాల ప్రకారం.. 142 మంది ఉపాధ్యాయులకు తాము పనిచేస్తున్న పాఠశాలల నుంచి స్థానచలనం తప్పేట్టు లేదని విద్యాశాఖ అధికారులు 2,059 ఖాళీలు ఉన్నాయి. పలు పాఠశాలల్లో 261 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్న చోట లేకపోగా.. 16 మంది ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు కాకుండా అధికంగా పనిచేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని లోకల్‌బాడీ పాఠశాలల్లో 3,782 మంది ఉపాధ్యాయులకు.. 3,315 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 465 ఖాళీలుండగా.. ఇందులో 350 మంది ఉపాధ్యాయులు తక్కువగాను.. 10 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన సంఖ్యకంటే ఎక్కువగా ఉన్నారు. మైదాన ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 67 మంది, ఏజెన్సీ ప్రాంతంలో 49 మంది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాకుండా ఎక్కువగా ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు లెక్కలు సేకరించారు. గిరిజన ఆవాస ప్రాంతాలు, పట్టణాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉండాల్సిన ఉపాధ్యాయులకంటే.. 521 మంది ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారని, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, భద్రాచలం, మధిర, వైరా వంటి పట్టణ ప్రాంతాలు, సమీపంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లేకపోయినా 142 మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
 
ఈ వివరాల ప్రకారం రేషనలైజేషన్‌లో 142 మంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలల నుంచి మరోచోటుకు వెళ్లక తప్పదని అధికారులు అంటున్నారు. ఇలా ప్రతి 30 మందికి ఒక్కో ఉపాధ్యాయుడు పెరుగుతారు. అలాగే 151 నుంచి ప్రతి 30 మంది విద్యార్థుల పెరుగుదలకు ఎస్‌జీటీతోపాటు ఒక ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టు ఉంటుంది. ఇలా 211 నుంచి 245 మంది విద్యార్థులుంటే.. మ్యాథ్స్ 3, సోషల్, ఇంగ్లిష్ ఒక్కొక్కటి, ఎల్‌పీ1-2, ఎల్‌పీ2-1.. మొత్తం 8 పోస్టులు. 246 నుంచి 280 మంది విద్యార్థులుంటే.. మ్యాథ్స్ 3, సోషల్-2,ఇంగ్లిష్ 1, ఎల్‌పీ1-2, ఎల్‌పీ2-1.. మొత్తం 9 పోస్టులు. 281 నుంచి 315 వరకు మ్యాథ్స్ 4,సోషల్ 2, ఇంగ్లిష్ 1, ఎల్‌పీ1-2, ఎల్‌పీ2-1.. మొత్తం 10. 316 నుంచి 350 వరకు మ్యాథ్స్ 4, సోషల్ 2, ఇంగ్లిష్ 1, ఎల్‌పీ 4.. మొత్తం 11 పోస్టులు. 351 నుంచి 385 మంది విద్యార్థులకు మ్యాథ్స్ 5, సోషల్ 2, ఇంగ్లిష్ 1, ఎల్‌పీ 4.. మొత్తం 12 మంది ఉపాధ్యాయులుంటారు.
 
 హైస్కూళ్లు(6 నుంచి 10 వరకు)
 220 మంది విద్యార్థులకు ఒక హెచ్‌ఎం, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, ఇంగ్లిష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, పీఈటీ ఒక్కొక్కరు చొప్పున 9 మంది ఉపాధ్యాయులు. 221 నుంచి 250 వరకు అన్ని ఎస్‌ఏ పోస్టులతోపాటు మ్యాథ్స్ ఇద్దరు, 251 నుంచి 280 మంది విద్యార్థులకు మిగతా వాటితోపాటు మ్యాథ్స్, ఇంగ్లిష్‌కు ఇద్దరు ఎస్‌ఏలు ఉంటారు. 281 నుంచి 310 వరకు విద్యార్థులుంటే.. మిగతా ఉపాధ్యాయులతోపాటు మ్యాథ్స్ 2, ఇంగ్లిష్ 2, సోషల్ 2.. ఇలా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంటే స్కూల్ అసిస్టెంట్ల సంఖ్యను కూడా పెంచనున్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement