ఫీవర్ ఆసుపత్రిలో రేబీస్ కేసు నమోదు | registered a case of rabies in hospital Fever | Sakshi
Sakshi News home page

ఫీవర్ ఆసుపత్రిలో రేబీస్ కేసు నమోదు

Published Sun, Jul 31 2016 6:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

registered a case of rabies in hospital Fever

నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఆదివారం ఓ నమోదైంది. వివరాలు... నల్లగొండ జిల్లా మోత్కూరు గట్టు సింగారం గ్రామానికి చెందిన కిష్టయ్య(50)ను రెండు నెలల క్రితం ఓ వీధికుక్క కరిచింది. ఆ సమయంలో అతను సరైన చికిత్సలు తీసుకోలేదు.

 

కాగా శనివారం సాయంత్రం నుంచి వింతగా ప్రవర్తిస్తున్న అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అనుమానంతో మెరుగైన చికిత్సల కోసం హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు శనివారం రాత్రి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. కిష్టయ్యను పరీక్షించిన అక్కడి వైద్యులు రేబీస్‌గా నిర్ధారించి ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్థుతం రోగి పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది, 24 గంటలకు మించి బతకడం కష్టమని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement