- ఎమ్మెల్యే, మేయర్‌పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు
- కార్పొరేటర్ ఉమామహేశ్వర్
అనంతపురం రూరల్:
తనపై కక్ష సాధింపుతోనే ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూపలు విజయనగర్‌కాలనీ శివారులో పేదల ఇళ్లను కూల్చివేయించారని 29వ డివిజన్ కార్పొరేటర్ ఉమామహేశ్వర్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరులు కేశవ్, బంగినాగలు వక్ఫ్‌బోర్డు స్థలాలు ఆక్రమించుకుని ఒక్కో స్థలాన్ని రూ.50వేలకు అమ్ముకుంటున్నా చర్యలు తీసుకోని ఆయన.. 200 మంది నిరుపేదలకు నిలువ నీడ లేకుండా చేశారన్నారు. ఇదేమని ప్రశ్నించినందుకే తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలకు ఎమ్మెల్యే, మేయర్ చిరునామాగా మారిపోయారన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తానన్నారు. నిరుపేదలకు శాశ్వత నివాసం చూపకపోతే బాధితులతో కలిసి ప్రత్యక్ష పోరాటాలు చేపడతానని హెచ్చరించారు.