కోట్ల బ్యారేజి గేట్లకు మరమ్మతులు | repairs for kotla barrage gates | Sakshi
Sakshi News home page

కోట్ల బ్యారేజి గేట్లకు మరమ్మతులు

Published Mon, Jul 10 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

కోట్ల బ్యారేజి గేట్లకు మరమ్మతులు

కోట్ల బ్యారేజి గేట్లకు మరమ్మతులు

కర్నూలు(సిటీ) : మండల పరిధిలోని సుంకేసుల వద్ద తుంగభద్రనదిపై నిర్మించిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజి గేట్ల మరమ్మతులు సోమవారం ప్రారంభమయ్యాయి. క్రస్ట్‌ గేట్లకు రంగులు వేయడం, రోప్స్, రబ్బర్‌ సీల్స్, వాక్‌ వే నిర్మాణం తదితర వాటి కోసం నీరు-చెట్టు కింద రూ.8 కోట్లతో టెండర్లు పిలువగా స్వప్న కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పనులను దక్కించుకుంది. ఇటీవలే ఏజెన్సీతో కేసీ కాలువ ఇంజనీర్లు అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం బ్యారేజికి రంగులు వేసే పనులను డీఈఈ జవహర్‌రెడ్డి, ఏఈఈ శ్రీనివాసరెడ్డి పూజ చేసి ప్రారంభించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement