మామిడికుదురు: తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి పుష్కరఘాట్‌లో గుండెపోటుతో ఓ విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. కాట్రేనికోన మండలం చింతలమెరక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వాసంశెట్టి నరేందర్‌రావు (62) కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం అప్పనపల్లి పుష్కరఘాట్‌కు వచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో నరేందర్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, అప్పనపల్లి పుష్కర ఘాట్‌లో ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయానికి సుమారు 1.20 లక్షల మంది పుణ్య స్నానాలు చేశారు.