
లింబ్‌సెంటర్‌కు విరాళం అందజేస్తున్న ధర్మరావు
- రూ.1.25 కోట్ల విలువైన పాదాలు పంపిణి
- రోటరీ క్లబ్ 3150 జిల్లా గవర్నర్ రత్నప్రభాకర్
ఖమ్మం కల్చరల్: రెండు తెలుగు రాష్ట్రాలలో 95 క్లబ్‌లు 320 సభ్యులతో రోటరీ క్లబ్ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ 3150 జిల్లా గవర్నర్ ఎం. రత్నప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఎన్నెస్పీ లింబ్‌సెంటర్‌లో 2016 రోటరీక్లబ్ ఆఫ్ ఖమ్మం అధ్యక్షుడు ధర్మరావు లింబ్ సెంటర్ కోసం రూ. లక్షా యాభైవేల విరాళం ఆయనకు అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రత్నప్రభాకర్ మాట్లాడుతూ రోటరీ అంటే గుర్తుకొచ్చేది పోలియో నివారణ కార్యక్రమమని ప్రపం^è ంలో పోలియో ఎక్కడున్న మన పక్కనే ఉన్నట్లు భావించి నిర్మూలనకు పోరాడాలని సూచించారు. ఖమ్మం లింబ్‌సెంటర్ ద్వారా 30 ఏళ్లుగా సుమారు 1.25 కోట్ల విలువైన 7500 పాదాలను ఉచితంగా అందజేశామన్నారు.లింబ్‌సెంటర్ నిజామాబాద్, కొత్తగూడెం, హైదరాబాద్‌లలో ఉన్నప్పటికి ఖమ్మం లింబ్‌సెంటర్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. భారతదేశంలో అక్షరాస్యతను పొందేందుకు రోటరీక్లబ్ టీచర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఉత్తమ టీచర్లకు నేషనల్ బిల్డర్ అవార్డును అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఎం. సత్యనారాయణ, జిల్లా మాజీ గవర్నర్ మల్లాది వాసుదేవ్, 2016 అధ్యక్ష, కార్యదర్శులు దొడ్డపనేని ధర్మరావు, తుళ్ళూరి వెంకటేశ్వర్లు, దొడ్డపనేని సాంబశివరావు, బాబాజీరావు పాల్గొన్నారు.