శింగనమల : ఎరువుల దుకాణలలో బయోపెస్టిసైడ్స్ అమ్మితే చర్యలు తీసుకుంటామని ఏఓ పవన్‌కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని నాయనపల్లిక్రాస్ వద్ద నున్న సాయిబాబా, ఆదిత్య ఎంటర్‌ప్రైజర్, లక్ష్మినరసింహా ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. జేడీఏ ఆదేశాల మేరకు ఈతనిఖీలు చేపట్టామని పవన్‌కుమార్ చెప్పారు. ఈమూడు షాపులలో నిల్వ ఉంచిన రూ. 4 లక్షల స్టాక్‌ను సీజ్ చేశామన్నారు.