ప్రజల చేతిలో ఆయుధం స.హ చట్టం | RTI Commissioner Vijay Babu speaks at tirupati | Sakshi
Sakshi News home page

ప్రజల చేతిలో ఆయుధం స.హ చట్టం

Published Sat, Jul 16 2016 10:55 PM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

ప్రజల చేతిలో ఆయుధం స.హ చట్టం - Sakshi

ప్రజల చేతిలో ఆయుధం స.హ చట్టం

 రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు
 
తిరుపతి : సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో ఆయుధం లాంటిదని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.విజయబాబు పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్‌లోని వైఎస్సార్ సమావేశ మందిరంలో శుక్రవారం రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కేసులపై విచారణ చేపట్టారు.

ఆయన మాట్లాడుతూ సమాచార హక్కుచట్టం పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. తనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ చట్టం దోహదపడుతుందని పేర్కొన్నారు. పిటిషనర్ అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లోపు కచ్చితంగా అదించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని చెప్పారు. సమాచారం ఇవ్వని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజల కు చేరువ చేయడంలో పౌర సంఘాలు చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. సమాచార చట్టాన్ని మరింత పటిష్టం చేసేం దుకు కమిషన్ చర్యలు చేపట్టిందన్నారు. తొలిరోజు విచారణలో మొత్తం 40 కేసులను పరిష్కరించారు. మరి కొన్నింటిపై షోకాజ్ నోటీసులను జారీ చేశారు. అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మున్సిపల్ కమిషనర్ గైర్హాజరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కార్పొరేషన్ అదనపు కమిషనర్ శ్రీదేవి, దినేష్‌బాబు, అనంతరెడ్డి, రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాల మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement