519 ట్రాక్టర్ల ఇసుక డంప్ సీజ్
519 ట్రాక్టర్ల ఇసుక డంప్ సీజ్
Published Fri, Aug 19 2016 9:57 PM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM
త్రిపురారం : ఎక్కడైన..ఎవ్వరైన గోదాముల్లో ధాన్యం, బియ్యం, నిత్యావసర వస్తువులను నిల్వ చేయడం చూశాం. కానీ ఇసుక డంప్ చేయడం చూసి ఉండరు. కాని ఇది నిజం.. కొందరు ఏకంగా నాలుగు గోదాముల్లో 519 ట్రాక్టర్ ఇసుకను డంప్ చేసిన వైనం మండలంలోని గజలాపురం సమీపంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పక్క సమాచారం మేరకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఇసుక డంప్ నిల్వలపై దాడులు నిర్వహించారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గజలా పురం రైల్వేబ్రిడ్జి సమీపంలో గల సర్వేనంబర్ 88, 97, 98, 99,100లో గల 26 ఎకరాల్లో లక్ష్మి నర్సింహ వేర్‌హౌసింగ్ పేరుతో 12 గోదాముల నిర్మాణం చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నాలుగు గోదాముల్లో సుమారు 519 ట్రాక్టర్ ఇసుకను యజమాని డంప్ చేసినట్లు తెలిపారు. దీంతో గోదాములను సీజ్ చేసి గోదాములను స్థానిక వీఆర్వో రాములమ్మకు అప్పగించారు. రెండు లారీలను కూడా సీజ్‌చేసి పోలీసులకు అప్పగించారు. పంచనామా చేసిన నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మంగ, సీనియర్ అసిస్టెంట్ శ్రవన్, శ్రీనివాస్, మైనింగ్ అధికారులు సైదులు, మధుకుమార్, సర్వేయర్లు తదితరులు ఉన్నారు.
Advertisement