మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
భద్రాచలం:
జిల్లాలోని ఇసుక రీచ్‌లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ పీఓ చాంబర్‌లో టీఎస్‌ఎండీసీ, ఇరిగేషన్, మైనింగ్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లాలోని ఇసుక రీచ్‌ల సమన్వయ కమిటీ సమావేశంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..ఇసుక రీచ్‌లను ఇతర శాఖాధికారులతో ఏర్పాటు చేసిన టీమ్ తరచుగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ములకలపల్లి, ముదిగొండ, మధిర, బోనకల్‌లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, నివేదిక మేరకు నిలిపివేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. వాజేడు మండలం మోడికుంట ప్రాజెక్ట్ వద్ద 20,280 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను టీఎస్‌ఎమ్‌డీసీ ద్వారా ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తు చేసుకున్న వారికే విక్రయించాలని సూచించారు. కొత్తగా వచ్చిన కొండాయిగూడెం, వీరాపురం, భద్రాచలం, ఇసుక రీచ్‌ల ద్వారా 10.47 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు టీఎస్‌ఎండీసీ నిర్వహించాలని తెలిపారు. 2013–14కు గాను సొసైటీల్లో క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున ఆదాయం వచ్చిన నిధుల నుంచి పరిపాలన ఖర్చుల నిమిత్తం రూ. 3, సభ్యులకు బోనస్‌గా రూ. 37 లు పంపిణీ చేయాలన్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల కోసం వచ్చిన 49 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ, టీఎస్‌ఎండీసీ డీఓ మల్లయ్య, డ్వామా పీడీ జగత్ కుమార్ రెడ్డి, మై¯Œ్స జేడీ నర్సింహారావు, మధుసూద¯ŒSరెడ్డి, ఇరిగేష¯ŒS ఎస్‌ఈ, అగ్రికల్చర్ ఏడీ, ఆర్‌టీఓ, గ్రౌండ్ వాటర్ డీడీ తదితరులు పాల్గొన్నారు.