
'ఏపీ కేంద్ర మంత్రులకు ఎస్‌ఎంఎస్ పంపండి'
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ప్రతిఒక్క విద్యార్థి ఒక ఎస్‌ఎంఎస్‌ను పంపించి కేంద్రప్రభుత్వం కళ్ళు తెరిచేలా చేయాలని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం హామీలు గుప్పించి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశాయని ధ్వజమెత్తారు.
ప్రత్యేకహోదా కోసం ప్రతి విద్యార్థి ఉద్యమించాలన్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు (9396693766), నిర్మలాసీతారామన్ (09910020595), సుజనాచౌదరి (09013181699), అశోక్‌గజపతిరాజు (0990822599)లకు ఎస్‌ఎంఎస్ చేయాలని సూచించారు.