విజయవాడ: హిందువుల మనోభావాలను టీడీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి వ్యాఖ్యానించారు. 1903 నుంచి ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాలను కూల్చేశారని మండిపడ్డారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
రాహు, కేతువుల ఆలయాన్ని తొలగించడం ప్రభుత్వానికే గండమని అన్నారు. కృష్ణా మందిరాన్ని ఉంచుతామని చెప్పి కూల్చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ర్యాలీ చేస్తామని శివస్వామి వెల్లడించారు.
'మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీసింది'
Published Sun, Jul 3 2016 3:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM
Advertisement
Advertisement