నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం పొందుసత్రం వద్ద పోలీస్ వ్యాన్ - స్కార్పియో వాహనం శనివారం తెల్లవారుజామున ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎస్ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.