దక్షిణ భారత విశ్వవిద్యాలయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు ఎస్కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రెటరీ జెస్సీ, అంతర్ కళాశాలల క్రీడా పోటీల అధ్యక్షకార్యదర్శులు శంకరయ్య, ముస్తఫా కమల్ బాషా తెలిపారు.
హిందూపురం టౌన్ : దక్షిణ భారత విశ్వవిద్యాలయ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు ఎస్కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రెటరీ జెస్సీ, అంతర్ కళాశాలల క్రీడా పోటీల అధ్యక్షకార్యదర్శులు శంకరయ్య, ముస్తఫా కమల్ బాషా తెలిపారు. గురువారం స్థానిక ఎంజీఎం మైదానంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్కేయూ అంతర్ కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఆరు జట్లు తలపబడగా ప్రతిభ కనబరిచిన వారిని దక్షిణ భారత విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపిక చేశారు.
ఎంపికైన వారిలో కె.ఎస్.శిరీషా, బి.కీర్తి (హిందూపురం), జి.శాంతకుమారి (ఎస్కేయూ), జె.గౌతమి (కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల), పి.ఐశ్వర్య (ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల) ఉన్నారు. వీరు అక్టోబర్ 3 నుంచి ఆరు రోజుల పాటు తమిళనాడులోని మధురైలో ఉన్న మధురై కామరాజు కళాశాలలో జరిగే దక్షిణ భారత వర్శిటీ పోటీల్లో పాల్గొననున్నారు.