నగరంలో వర్షం.. | slight rain distrubed the city people of there weekend | Sakshi
Sakshi News home page

నగరంలో వర్షం..

Published Sat, Sep 10 2016 9:33 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

నగరంలో వర్షం.. - Sakshi

నగరంలో వర్షం..

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో శనివారం సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో  ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, అమీర్‌పేట్,ఖైరతాబాద్, పంజగుట్ట, బేగంపేట్, కూకట్‌పల్లి, అబిడ్స్, కోఠి, ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, తదితర ప్రాంతాల్లో భారీగాను, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌ వంటి చోట్ల ఓ మోస్తరుగాను వర్షం కురిసింది.

వర్షం కారణంగా ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. శనివారం వీకెండ్‌ కావడంతో కాలక్షేపం కోసం బయటకు వచ్చిన నగరవాసులు తిరిగి ఇళ్లకు చేరుకోవడం కష్టమైంది. మరోవైపు వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కూడా ఖైరతాబాద్, నెక్లెస్‌రోడ్డు మార్గంలో రద్దీ కనిపించింది. నగరంలో రాత్రి 8.30 గంటల వరకు 2.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.        


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement