పల్లెల్లో ముగిసిన ప్రజాసాధికార సర్వే
Published Wed, Nov 23 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
- బుధవారం సాయంత్రంలోగా సర్వే ముగిసినట్లు సర్టిఫికెట్లు ఇవ్వాలని జేసీ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసాధికార సర్వే ముగిసింది. మండలాలు, ఎన్యూమరేషన్ బ్లాక్‌ల వారీగా మొత్తం జనాభా ఎంత, ఎంత మందిని సర్వే చేశారు, ఎంత మందిని సర్వే చేయలేదు, ఇందులో మరణించినవారు, వలస వెళ్లినవారు, సర్వే పరిధిలోకి రానివారు, సర్వేకు దూరంగా ఉన్నవారు తదితర వివరాలను తెలియజేస్తూ సర్వే ముగించినట్లు బుధవారం సాయంత్రంలోగా సర్టిఫికెట్‌లు ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్యూమరేటర్లు ముందుగా ఈ విధమైన సర్టిపికెట్‌లు తహసీల్దారుకు ఇవ్వాలి. దీనిని బట్టి తహసీల్దార్లు సర్వే ముగిసినట్లు సర్టిపికెట్ ఇవ్వాల్సి ఉంది. అర్బన్ ప్రాంతాల్లో ఈ నెలాఖరుతో సర్వేను ముగించే అవకాశం ఉంది. డిసెంబరు నుంచి సర్వే నివేదిక ప్రకారం పథకాలు అమలవుతాయి.
Advertisement