స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేయాలి
-
కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు(అర్బన్):
ఈ నెలాఖరు నాటికి జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. సర్వేకి సంబంధించిన విషయాలపై ఆయన కలెక్టర్ బంగ్లాలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2011 జనాభ లెక్కల ప్రకారం జిల్లాలో 29.52 లక్షల మందికి సర్వే చేయాల్సి ఉండగా 23.86లక్షల మందికి సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్‌లో 5.84 లక్షలమందికి గాను 3.34 లక్షల మందికి సర్వే పూర్తి చేశామన్నారు. రూరల్‌లో 90 శాతం అర్బన్‌లో 60శాతం సర్వే పూర్తి చేశామన్నారు. ఎన్యూమరేటర్లు సర్వే కోసం వచ్చినప్పుడు ఆధార్, రేషన్ కార్డు, ఆస్తిపన్ను, ఓటరు కార్డు, కరెంటు బిల్లు, డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్, గ్యాసు, పట్టాదారుపాసు పుస్తకాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎన్యూమరేటర్లు రాని పక్షంలో టోల్ ఫ్రీ 1800 425 2499కు ఫోన్ చేయాలని సూచించారు. సర్వే పూర్తయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.