అప్పుడే ఎందుకు పొందుపరచలేదు: వెంకయ్య | Special status on Venkaiah Naidu talks! | Sakshi
Sakshi News home page

అప్పుడే ఎందుకు పొందుపరచలేదు: వెంకయ్య

Published Fri, Jul 22 2016 4:59 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

అప్పుడే ఎందుకు పొందుపరచలేదు: వెంకయ్య - Sakshi

అప్పుడే ఎందుకు పొందుపరచలేదు: వెంకయ్య

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేలా   పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో కాంగ్రెస్ ఆనాడు ఎందుకు పొందుపరచలేదని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. పార్లమెంటు వద్ద గురువారం ఆయన మాట్లాడారు. కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందా అన్న  ప్రశ్నకు.. ఈ విధంగా స్పందిం చారు. అయినా చూద్దాం అని  వ్యాఖ్యానించారు.   

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మద్దతు: టీడీపీ
రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిందని టీడీపీ విమర్శించింది. అయినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. గురువారం ఢిల్లీలో టీడీపీ లోక్‌సభ పక్షనేత తోట నరసింహం, ఆ పార్టీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement