సూర్యాపేట: నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో విద్యార్థులు సోమవారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీఎం కాన్వయ్ను అడ్డుకున్న కేసులో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు బంద్ చేపడుతున్నారు. ఈ సందర్భంగా ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించిన విద్యార్థులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధర్నాలో పలువురు విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేటలో విద్యాసంస్థల బంద్
Published Mon, Jul 11 2016 10:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM
Advertisement
Advertisement