విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): సూపర్ స్పెషాలిటీ (డీఎం/ఎంసీహెచ్) మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జూలై 31న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. 13 స్పెషాలిటీస్‌లో అడ్మిషన్ల కోసం మొత్తం 752 మంది దరఖాస్తు చేసుకోగా, 709 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఎం విభాగం కార్డియాలజీలో డాక్టర్ ఎల్‌కేవీ కుమార్ కేశంశెట్టి (ఏయూ), ఎండోక్రైనాలజీలో డాక్టర్ నామాని జ్ఞానేష్ (ఓయూ), గ్యాస్ట్రో ఎంట్రోలజీలో డాక్టర్ వేముల వంశీకృష్ణ (ఏయూ), నియోనాటాలజీలో డాక్టర్ కోగంటి రాజా అశోక్ (నాన్‌లోకల్), నెఫ్రాలజీలో డాక్టర్ పులగం శివతేజ (ఏయూ), న్యూరాలజీలో డాక్టర్ పప్పాల క్రాంతి (ఏయూ) మొదటి ర్యాంకులు సాధించారు.
అలాగే ఎంసీహెచ్ విభాగం కార్డియో థొరాసిక్ సర్జరీ(సీటీసీ)లో డాక్టర్ ఎన్.హర్షవర్థన్ (ఓయూ), జెనిటో యూరినరీ సర్జరీలో డాక్టర్ కిరణ్ యు (ఓయూ), న్యూరో సర్జరీలో డాక్టర్ ఈడ్పుగంటి రాజ్యలక్ష్మి (నాన్‌లోకల్), పీడియాట్రిక్ సర్జరీలో డాక్టర్ రవి హిమజ (ఏయూ), ప్లాస్టిక్ సర్జరీలో డాక్టర్ అమూల్య పేర్ల (ఏయూ), సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో డాక్టర్ డీవీ జయదీప్ నేతా (ఓయూ), సర్జికల్ అంకాలజీలో డాక్టర్ ఫణీంద్రకుమార్ నాగిశెట్టి (ఏయూ) మొదటి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
సూపర్ స్పెషాలిటీ మెడికల్ ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల
Published Sun, Aug 14 2016 3:03 AM | Last Updated on Tue, Oct 9 2018 7:05 PM
Advertisement
Advertisement