- టీపీఎస్‌ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు
- కలెక్టర్ ఆదేశాలు జారీ.. ఇప్పటికి నలుగురు
సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి మున్సిపాలిటీలో అక్రమాలకు పాల్పడే వారినే కాదు విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిని కూడా సహించేది కలెక్టర్ గతంలోనే హెచ్చరించారు. అనుకున్నట్లే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేస్తూ మరి కొందరిని సరెండర్ చేస్తూ మున్సిపాల్టీపై అధికారులు పట్టు సాధిస్తున్నారు. దీంతో పాలకవర్గ సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. సంగారెడ్డి టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రాజేంద్రప్రపాద్ జనవరిలో ఇక్కడిక బదిలీపై వచ్చారు. ఇండ్ల నిర్మాణ అనుమతుల మంజూరీలో చేతులు తడిపితే కానీ ఫైలు ముట్టడం లేదని పలు మార్లు టీపీఎస్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి.
దీంతో గత నెలరోజుల్లో టీపీఎస్ పనితీరుపై ఓ శాఖకు చెందిన జిల్లా అధికారితో విచారణ చేపట్టి నివేదికను సోమవారం మున్సిపల్ ఉన్నతాధికారులకు అందజేశారు. దాని ప్రకారం అయనను సరెండర్ చేస్తూ అధికారులకు సిఫార్సు చేశారు.దీంతో టీపీఎస్ రాజేంద్రప్రసాద్‌ను జీహెచ్‌ఎంసీకీ సరెండర్ చేస్తూ సోమవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. టీపీఎస్ రాజేంద్రప్రసాద్‌ను సరెండర్ చేయడంతో టౌన్‌ప్లానింగ్ సెక‌్షన్ పూర్తిగా ఖాళీ అయింది.