జిల్లాలో స్వై¯ŒSప్లూ కేసులు పెరగడం పట్ల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. శీతాకాలం, శీతల దేశాల్లో వ్యాపించే స్వై¯ŒSఫ్లూ వేసవిలో తీవ్రంగా వ్యాపిస్తుండడంపై వైద్యులు సైతం విస్మయానికి గురవుతున్నారు. జిల్లాలో 2012లో తాళ్లరేవు మండలం
-
ఇద్దరి మృతి
-
16 కేసుల నమోదు
-
వాటిలో ఆరు పాజిటివ్
కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) :
జిల్లాలో స్వై¯ŒSప్లూ కేసులు పెరగడం పట్ల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. శీతాకాలం, శీతల దేశాల్లో వ్యాపించే స్వై¯ŒSఫ్లూ వేసవిలో తీవ్రంగా వ్యాపిస్తుండడంపై వైద్యులు సైతం విస్మయానికి గురవుతున్నారు. జిల్లాలో 2012లో తాళ్లరేవు మండలం చినబొడ్డువెంకటాయపాలెంలో ఈ వ్యాధిని తొలిసారిగా వైద్యాధికారులు గుర్తించారు. తిరిగి ఐదేళ్ల తర్వాత ఈ వ్యాధి వ్యాపిస్తోంది. ఇప్పటిదాకా జిల్లాలో 17 స్వై¯ŒSఫ్లూ కేసులు నమోదు కాగా, వాటిలో ఏడుగురికి ఈ వ్యాధి సోకినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. వీరిలో పాజిటివ్‌గా వచ్చిన రోగుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇద్దరు మృతి చెందారు.
ప్రైవేటు ఆస్పత్రి ఒకరు, జీజీహెచ్‌లో మరొకరు..
జిల్లా వ్యాప్తంగా స్వై¯ŒSఫ్లూ బారిన పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కాజులూరు మండలం కుయ్యేరుకు చెందిన సీహెచ్ వీర్రాజు (44) ఈ నెల 5న ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రామచంద్రపురానికి చెందిన ఆకాశపు బాబూరావు (65) చికిత్స కోసం హైదరాబాద్ Ðవెళ్లినా శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ జీజీహెచ్‌కి బంధువులు తీసుకువచ్చారు. అతడు ఇక్కడ చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు.
కుదుటపడిన నలుగురి ఆరోగ్యం...
తీవ్ర జ్వరం, ఒళ్లు, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది లక్షణాలతో జిల్లాలో 17 మంది ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులలో చేరారు. వీరి గొంతు, ముక్కులోంచి లాలాజలం, ఉమ్మును పరీక్ష కోసం విశాఖపట్టణం కేజీహెచ్‌కు పంపించారు. వారిలో 6 గురు బాధితులకు హెచ్1ఎ¯ŒS1 ఇ¯ŒSప్లూఎంజ వైరస్ కారణంగా స్వై¯ŒSఫ్లూ సోకినట్టు పరీక్షల్లో తేలింది. రామచంద్రపురంలో ముగ్గురు, రావులపాలెం మండలం దేవరాపల్లి, కాజులూరు మండలం కుయ్యేరు, పిఠాపురం మండలం విరవలో ఒక్కక్కరికి ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడుగురు చేరగా, వీరిలో నలుగురు బాధితులు స్వై¯ŒSఫ్లూ ఉన్నట్టు గుర్తించారు. జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్యం అందించడంతో ఆరుగురిలో నలుగురు డిశ్చార్చి కాగా మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది.
కడియపులంకలో స్వై¯ŒSఫ్లూ లక్షణాలు
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : మండలంలోని కడియపులంకలో కిరాణా షాపు నిర్వహించే 39 ఏళ్ల వయసు ఉన్న గ్రంధి వీరవెంకటసత్యనారాయణకు స్వై¯ŒSఫ్‌లై లక్షణాలు బయటపడ్డాయి. జలుబుతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడు రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోగా స్వై¯ŒSఫ్లూగా నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని స్థానికులు వివరించారు. ఇదే గ్రామంలో మరో ఇద్దరికి ఈ లక్షణాలున్నాయని తెలియడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమైంది. వారిని పరీక్షించి స్వై¯ŒSఫ్లూ కాదని ప్రాథమికంగా నిర్ధారించినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇవే లక్షణాలతో బుర్రిలంక గ్రామానికి చెందిన పి.శ్రీనివాస్ రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
ఖరీదైన మందులు సిద్ధంగా ఉన్నాయి
స్వై¯ŒSఫ్లూ నివారణకు ఖరీదైన మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది కలెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బందిని పూర్తి అప్రమత్తం చేశాం. స్వై¯ŒSఫ్లూ కేసులు నమోదైన రావులపాలెం, రాజమహేంద్రవరం, కుయ్యేరులో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో సర్వే చేయించాం. క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. స్వై¯ŒSఫ్లూ అనుమానంతో 16 కేసులు రాగా, ఇందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మరో నాలుగురు అనుమానితుల పరీక్ష నివేదిక విశాఖ కేజీహెచ్ నుంచి రావాల్సి ఉంది. కాకినాడ జీజీహెచ్, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రత్యేక స్వై¯ŒSఫ్లూ వార్డులను ఏర్పాటు చేశాం.
– డాక్టర్ కె.చంద్రయ్య, డీఎంహెచ్‌ఓ, కాకినాడ