
చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలి
సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని లేఖ
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని పునరుద్ధరించి వాటిని ప్రభుత్వ రంగంలో నిర్వహిం చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి ప్రభుత్వ రంగంలో నడిపిస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల హామీ సంగతి ఎలా ఉన్నా.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే నిజాం షుగర్స్ పేరుతో నడుస్తున్న 3 యూనిట్లు పూర్తిగా మూతపడ్డా యన్నారు. ఇవి మూతపడి ఏడాదవుతున్నా వాటిని తెరిపించలేకపోయారన్నారు.