హోం వర్క్‌ చేయలేదని.. | teacher beats student in dharmavaram | Sakshi
Sakshi News home page

హోం వర్క్‌ చేయలేదని..

Published Wed, Sep 21 2016 11:01 PM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM

హోం వర్క్‌ చేయలేదని.. - Sakshi

హోం వర్క్‌ చేయలేదని..

- విద్యార్థిని చితకబాదిన టీచర్‌
- ఆందోళనకు దిగిన విద్యార్థి తల్లిదండ్రులు


ధర్మవరం టౌన్‌ : హోం వర్క్‌ చేయలేదని విద్యార్థి భుజం కందిపోయేలా చితకబాదిన ప్రైవేట్‌ పాఠశాల టీచర్‌ ఉదంతం ధర్మవరంలో వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు... పట్టణంలో పట్టుచీరల వ్యాపారి ఆదినారాయణ కుమారుడు చరణ్‌తేజ్‌ శ్రీచైతన్య ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదువుతున్నాడు. మంగళవారం ఉదయం చరణ్‌తేజ్‌ హోం వర్క్‌ చేసుకురాలేదని టీచర్‌ కవిత కర్రతో భుజంపై ఇష్టమొచ్చినట్లు కొట్టారు. దెబ్బలకు ఆ ప్రాంతం కందిపోయి, వాతలు పడ్డాయి.

భయపడిపోయిన చరణ్‌ సాయంత్రం ఇంటికెళ్లాక టీచర్‌ కొట్టిన దెబ్బలను తల్లిదండ్రులకు చూపించాడు. అప్పటికే జ్వరం ఎక్కువగా ఉండటంతో అనంతపురం తీసుకువెళ్లి చికిత్స చేయించారు. బుధవారం ఉదయం శ్రీచైతన్య పాఠశాల ఎదుట బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. చిన్నపిల్లాడని చూడకుండా గొడ్డుని బాదినట్టు బాదుతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థి తల్లిదండ్రులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. తమ కుమారుడి లాగా ఎవరికీ ఇటువంటి పరిస్థితి రాదని హామీ ఇవ్వాలని బాధిత తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్‌ చేశారు. కాగా ఈ ఘటనపై ఆందోళనలను ఉ«§lతం చేస్తామని ఐక్య విద్యార్థి సంఘాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement