కడియం వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా | teachers dharna against kadiyam srihari | Sakshi
Sakshi News home page

కడియం వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా

Aug 10 2016 12:42 PM | Updated on Sep 4 2017 8:43 AM

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్లో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేపట్టాయి.

హత్నూర: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తాలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మహిళా టీచర్లు ఇంట్లో వంట వండుకోవడం, యూనియన్లకు డైరీలు పట్టుకుని తిరగడం తప్ప ఏమీ చేయటం లేదని కడియం మంగళవారం ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. దీనికి నిరసనగా ఉపాధ్యాయులు దౌల్తాబాద్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. తెలంగాణ తల్లి విగ్రహానికి విజ్ఞాపన పత్రం సమర్పించారు. వెంటనే కడియం శ్రీహరి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement