గురువులారా.. వందనాలు..
-
వర్ధన్నపేట నియోజకవర్గంలో రేపు ప్రతి టీచర్‌కు సన్మానం
-
గ్రామస్థాయి ముఖ్యులతో కార్యక్రమ నిర్వహణ
-
ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన ఎమ్మెల్యే అరూరి రమేష్
వర్ధన్నపేట : నిరుపేద పిల్లలకు విద్యనందించే ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే ప్ర భుత్వ లక్ష్యానికి అనుగుణంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కొన్ని నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా ‘బడి మనదే... బాధ్య త మనదే’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పేదలకు విద్యను బోధించే ప్రభు త్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు అ రుదైన గౌరవం ఇచ్చే మరో కార్యక్రమాన్ని ఆయన రూపొందించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యా ప్తంగా ఈ ్డనెల 9వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాల ల్లోని టీచర్లకు గౌరవ సన్మానం చేసేందుకు ప్ర ణాళిక సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో ఉదయ మే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ఇందులో పాల్గొననున్నా రు. గ్రామానికి ఒకరు చొప్పున కార్యక్ర మ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే అరూరి రమేష్ నియోజకవర్గంలోని మూడు నాలుగు చోట్ల ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 9 న ఉదయం ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎం పీటీసీలు, వార్డు సభ్యులు, పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యులు, గ్రామ అభివృద్ధి కమి టీ అ« ద్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో ని ముఖ్యులు స్థానిక దేవాలయాలకు చేరుకుం టారు. అందరు కలిసి డప్పుచప్పుళ్లతో పాఠశాలకు బయలుదేరి వెళ్తారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలకు చేరుకుని అక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరినీ సన్మానిస్తారు. ఒక గ్రా మంలో ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ పాఠశాలలు ఉంటే... అందరు ఉపాధ్యాయులను ఉ న్నత పాఠశాలకు ఆహ్వానించి అక్కడ సన్మాన కార్యక్రమం నిర్వíß ంచనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలి పి 1350 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉ న్నారు. విద్యా వలంటీర్లు, సీఆర్‌పీ, సాక్షర భా రత్ సమన్వయకర్తలు కలిపి మరో 200 మంది ఉన్నారు. మొత్తంగా 1550 మంది ప్రభుత్వ పా ఠశాల్లోని విద్యాబోధకులకు అరుదైన సన్మానం నిర్వహించే కార్యక్రమం జరగబోతోంది. ఉపాధ్యాయుల ప్రత్యేక సన్మాన కార్యక్రమానికి సం బంధించి... ఉపాధ్యాయులకు, ప్రజాప్రతినిధు లకు, గ్రామాల్లోని ముఖ్యులకు ఎమ్మెల్యే అరూ రి రమేష్ ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు.
జూన్‌లో మన బడి– మన బాధ్యత ప్రారంభం..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతోపాటు ఈ ప్రక్రియలో స్థానికులను భాగస్వాములను చేసేలా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఈ ఏడాది జూన్‌లో ‘మన బడి– మన బాధ్యత’ కార్యక్రమాన్ని రూపొం దించారు. ఈ మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేలా వివిధ దశల్లో పర్యవేక్షణ కమిటీలను నియమించారు.
దారి చూపే గురువులకు సన్మానం
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఇటీవల ‘మన బడి... మన బాధ్యత’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పించే లక్ష్యంతో కార్యక్రమం మొదలైంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల్లోని ఉపాధ్యాయులందరికీ ఒకేరోజు, ఒకే సమయంలో సన్మానం చేయాలని నిర్ణయించాం. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటిసారి జరగబోతోంది. సన్మానంలో భాగంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు.. ఉపాధ్యాయులకు పూలదండలు, పండ్లు, శాలువాలు, పుస్తకాలు అందజేస్తారు. పేద పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే గురువులకు కొంత కృతజ్ఞతలు తెలుపుతాం.
– అరూరి రమేష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే