అంబరాన్నంటిన ఆవిర్భావ సంబరాలు | telangana formation day celebration in distic | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన ఆవిర్భావ సంబరాలు

Published Fri, Jun 3 2016 4:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

అంబరాన్నంటిన ఆవిర్భావ సంబరాలు - Sakshi

అంబరాన్నంటిన ఆవిర్భావ సంబరాలు

జిల్లాలో తెలంగాణ ఆవిర్భావదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.

ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.  జిల్లా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ తన క్యాంపు కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. కలెక్టరేట్‌లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్ ఆవరణంలోని ట్రెజరీ కార్యాలయ ఉద్యోగుల ప్రదర్శనలో మహిళా ఉద్యోగినులు బతుకమ్మలను, బోనాలను ఎత్తుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

 జెడ్పీలో..
జెడ్పీ ఆవరణలో జెడ్పీ చైర్ పర్సన్ గడిపెల్లి కవిత  జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో మారుపాక నాగేశ్, పీఆర్ ఈఈ ఐ.రమేష్, డిప్యూటి సీఈవో రాజేశ్వరి, ఏఓ భారతి, ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటపతిరాజు, పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. రవీంద్రపసాద్,తదితరులు పాల్గొన్నారు.

 ప్రభుత్వ కార్యాలయాల్లో...
డీపీఓ కార్యాలయంలో జెడ్పీ సీఈవో, ఇన్‌చార్జి డీపీవో మారుపాక నాగేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ రామయ్య పాల్గొన్నారు.

 ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. వాటర్‌గ్రిడ్ ఎస్‌ఈ శ్రీని వాసరావు, శ్యామ్‌రావు, భానుప్రసాద్  పాల్గొన్నారు.

♦  పంచాయతీరాజ్ ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలోజెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటపతిరాజు, రవి,రాజేశ్వరరావు, వాణిశ్రీ, కిశోర్‌రెడ్డి, రామకృష్ణరెడ్డి,చింపలరాజు,రంగారావు పాల్గొన్నారు.

ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు.అఖిల్, హసన్, రామారావు, రంగయ్య పాల్గొన్నారు.

 జిల్లా సివిల్‌సప్లై కార్యాలయంలో డీఎం సత్యవాణి ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు.

 తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె. లింగయ్య జెండాను ఆవిష్కరించారు. నగర అధ్యక్షుడు జి.నాగేశ్వరరావు, నాయకులు రమేష్, వెంకటేశ్వరరావు,బిక్కు పాల్గొన్నారు.

 సమాచారశాఖ  కార్యాలయంలో ఏడీ ముర్తుజా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్వోలు యాకుబ్‌పాషా, శ్రీనివాసరావు, డివిజనల్ పీఆర్వో దశరథం,ఉద్యోగులు వి. శ్రీనివాసరావు, శ్రీనివాస్,నారాయణరావులు పాల్గొన్నారు.

♦  తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.రంగరాజు జెండాను ఆవిష్కరించారు. కార్యదర్శి రామయ్య, నగర అధ్యక్షప్రధానకార్యదర్శులు వల్లోజు శ్రీనివాస్,సాగర్,రమణయాదవ్ పాల్గొన్నారు.

 ఖమ్మం వ్యవసాయం:  ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు  వేడుకలు జరుపుకున్నారు.

 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో....
డిసీసీబీ కార్యాలయంలో బ్యాంక్ చెర్మైన్ మువ్వా విజయ్ బాబు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. బ్యాంక్ పాలక వర్గ సభ్యులు పి.రాంబ్రహ్మం, కె.రంగరాజు, బ్యాంక్ సీఈఓ వి.నాగచెన్నారావు తదితరులు పాల్గొన్నారు.

 జేడీఏ కార్యాలయంలో...
జేడీఏ కార్యాలయంలో జేడీఏ పి.మణిమాల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఏడీఏ స్వరూపారాణి, రవికుమార్, నాగరాజు, కిషన్ నాయక్, వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.

 ఉద్యాన శాఖలో.....
ఉద్యాన శాఖ కార్యాలయాల్లో   డీడీ ఆర్.శ్రీనివాసర్ రావు, ఏడీహెచ్ కె.సూర్యనారాయణలు జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ఉద్యాన అధికారి శ్రావణ్, పాషా, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది  పాల్గొన్నారు.

 ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో...
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో  కార్యదర్శి ప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.   మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు టి. కిరణ్‌కుమార్, కార్యదర్శి రాజేంద్రప్రసాద్ వి. నాగేశ్వరి, నరేష్, వజీర్ బాలాజీ, పద్మ, నిర్మల పాల్గొన్నారు.

 ఏడీఎం కార్యాలయంలో...
జిల్లా మార్కెటింగ్ కార్యాలయంలో  మార్కెటింగ్  ఏడీఏ ఎస్.వినోద్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.   ఉద్యోగులు నరేందర్, సుమన్, రామకృష్ణ పాల్గొన్నారు.

 చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో...
ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో  తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ విగ్రహాలకు అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటేశ్వరరావు, చిన్ని కృష్ణారావులు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బోనకల్ రోడ్‌లో ఉన్న మానసిక వికలాంగులకు స్వీట్లు పంచారు. జి. శ్రీనివాసరావు, చింతల రామ లింగేశ్వరరావు,  టి. లక్ష్మీనర్సింహారావు,కె . ప్రవీణ్‌కుమార్,  ఎన్.కోదండరాములు, ఎం.రామారావు, ఎం.కృష్ణ, పి, శ్రీనివాసరావు,బి. శ్రీనివాసరావు,బి. రమణా రెడ్డి, పి. రమేష్, లక్ష్మీకాంతరావు,బి.రాజేశ్వరరావు, రాంమూర్తి, పి. నాగేశ్వరరావు  పాల్గొన్నారు.

 కార్మిక విభాగం ఆధ్వర్యంలో....కార్మిక సంఘం కార్యాలయం వద్ద జిల్లా నాయకులు ఎన్.మాధవరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోఎన్.సత్యనారాయణ,టి.వీరభద్రం, నాయకులు ఎస్.రామయ్య, ఎ. రాంరెడ్డి, కె.సైదిరెడ్డి, ఎ.శ్రీను. ఎ. వెంకన్న, వి.వెంకటనారాయణ, వెంకటప్పయ్య, మరాఠి యాదయ్య, ప్రకాష్, బిక్షం, జి.నాగేశ్వరరావు  పాల్గొన్నారు.

 దడువాయిల సంఘం ఆధ్వర్యంలో.....
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ దడువాయిల సంఘం ఆధ్వర్యంలో  సంఘం గౌరవ అధ్యక్షులు కృష్ణమూర్తి జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎం.లక్ష్మీనారాయణ, ఎన్.రాజేష్, ఎం. నర్సింహారావు, నర్సయ్య, కె.యాదయ్య, ఎ.సత్యనారాయణ, ఎం.నర్సిరెడ్డి, ఎస్.కోటేశ్వరరావు, చలమల నర్సింహారావు  పాల్గొన్నారు.

 బీజేపీ ఆధ్వర్యంలో  ..
ఖమ్మం మామిళ్లగూడెం:బీజేపీ  ఆధ్వర్యంలో జిల్లా అద్యక్షుడు బెరైడ్డి ప్రభాకర్‌రెడ్డి  జెండాను ఎగురవేశారు.  ఈ కార్యక్రమంలో నాయకులు  విద్యాసాగర్ ,వెంకటేశ్వరావు,సత్యనారాయణ,శ్రీనివాస్,డి.సత్యనారాయణ, రుద్రప్రదీప్, శ్రీదేవి, పుల్లేశ్వరావు, అశోక్, ప్రభాకర్,కోటేశ్వరావు, అప్పారావు ,కొమరయ్య పాల్గొన్నారు.

 టీడీపీ ఆధ్వర్యంలో..
ఖమ్మం అర్బన్:టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య జాతీయ జెండాను ఎగురవేశారు.  ఈ కార్యక్రమంలో కె. వెంకటేశ్వర్లు, కె. శివయ్య, ఎ. శ్రీనివాసరావు, ఎం. వెంకటేశ్వర్లు, కె. సత్యనారాయణ, ఎస్. రంగారావు, కె.సత్యనారాయణ, ఎన్.రంజిత్, ఎం.రామారావు, షేక్ మీరా పాల్గొన్నారు.

 సీపీఐ ఆధ్వర్యంలో..
ఖమ్మం సిటీ : తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవాన్ని సీపీఐ ఆధ్వర్యంలో  జాతీయ పతాకాన్ని  పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంత రావు ఎగుర వేశారు.

 డ్వామా ఆధ్వర్యంలో ...
డ్వామా జిల్లా కార్యాలయంలో  డ్వామా పీడీ జగత్‌కూమార్‌రెడ్డి జెండా అవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగులు మరింత కష్ట పడి  పని  చేయాలని కోరారు.

 సెట్ కాంలో...
తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని సెట్‌కాం ఆధ్వర్యంలోసెట్‌కాం సీఈవో పరంధమరెడ్డి జెండా అవిష్కరించి, అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

 డీఆర్‌డీఏలో ....
తెలంగాణ అవిర్భావ దినోత్సవాన్ని డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో  డీఆర్‌డీఏ పీడీ మురళీధర్‌రావు  జెండా అవిష్కరించి, అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ  కార్యక్రమంలో గృహ నిర్మాణ పీడీ శీలం మోహన్,సోషల్ వేల్ఫేర్ డీడీ సంచితానంద గుప్తా పాల్గొన్నారు.

 టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో..
ఖమ్మం వైరారోడ్ : టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో  రాష్ట్ర ఎస్సీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌బీ.బేగ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యే అజయ్‌కుమార్, నాయకులు పి.నాగేశ్వరరావు, ఎన్. వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ బి. మురళి, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు కె.మురళి పాల్గొన్నారు.

 డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో...
డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో అధికారులు కళావతిబాయి, మాలతి, అన్నప్రసన్న, నిర్మల్‌కుమార్, బి.వెంకటేశ్వరరావు, డెమో వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.

 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో...
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో  డీసీహెచ్‌ఎస్ అనందవాణి జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో మెడికల్ సూపరిండెంట్ టి. లక్ష్మణ్‌రావు, ఆర్‌ఎంఓ శోభారాణి, డాక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కృపాఉషశ్రీ, మోహన్‌రావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, నర్సింగ్ సూపరిండెంట్ సుగుణ, ఆర్‌వీఎస్ సాగర్, స్వాతికుమార్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement