బాబు అనుభవం ఉన్న నాయకుడనుకున్నా: హరీష్ | telangana minister harish rao slams on ap cm chandrababu over Water allocations | Sakshi
Sakshi News home page

బాబు అనుభవం ఉన్న నాయకుడనుకున్నా: హరీష్

Published Wed, Jun 8 2016 6:55 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

బాబు అనుభవం ఉన్న నాయకుడనుకున్నా: హరీష్ - Sakshi

బాబు అనుభవం ఉన్న నాయకుడనుకున్నా: హరీష్

తాండూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవగాహన, అనుభవం ఉన్న నాయకుడనుకున్నా..కానీ, కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి ఉమాభారతికి ఆయన లేఖ రాయడం చూస్తే అది తప్పని రుజువైందని తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

నీటి కేటాయింపుల విషయంలో బాబు చెబుతున్న మాటల్లో నిజాయితీ లేదని హరీష్ ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు ఆపేందుకు చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు తినే అన్నంలో మట్టికొట్టేందుకు కుట్రలు పన్నుతున్న చంద్రబాబు తెలంగాణ ద్రోహని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సర్కారు ఇష్టానుసారంగా మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెక్షన్ 89 అమలు కాకుండా సెక్షన్ 87 ఉత్పన్నం కాదని హరీష్ స్పష్టం చేశారు. తెలంగాణకు 389 టీఎంసీలు రావాల్సి ఉందని..బచావత్ అవార్డు అమలుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బచావత్ ప్రకారం అయితే రాయలసీమకు చుక్క నీరు కూడా రాదని...ఈ సమస్యను సత్వరమే పరిష్కారించాలని కేంద్రాన్ని కోరినట్టు హరీష్రావు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement