Water allocations
-
Krishna River Water: మళ్లీ త్రిసభ్య కమిటీకే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు బాధ్యతను మళ్లీ త్రిసభ్య కమిటీకే అప్పగిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్ఈ విజయ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, బోర్డుసభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా, 66:34 నిష్పత్తిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో 2015 జూన్‌లో కేంద్ర జలశక్తి శాఖ జరిపిన కేటాయింపులను ఇకపై కొనసాగించడానికి అంగీకరించమని రాహుల్ బొజ్జా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే త్రిసభ్య కమిటీ ఈసారి తెలంగాణకు కొంత వరకు కేటాయింపులు పెంచుతుందని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని రాహుల్»ొజ్జా తెలిపారు. సమావేశానంతరం ఈఎన్సీ జి.అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. కృష్ణానది 71శాతం తెలంగాణలో విస్తరించి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి 71శాతం, ఏపీకి 29 శాతం జలాలను కేటాయించాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2లో వాదనలు వినిపించిన అంశాన్ని బోర్డుకు వివరించామన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపిణీ జరపాలని డిమాండ్ చేశామని చెప్పారు. ఏపీ కొత్తగా ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వివరాలను అందించాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు కోరామన్నారు. ప్రతి చుక్కను లెక్కించాల్సిందే.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడాన్ని అడ్డుకోవాలని బోర్డును కోరామని రాహుల్‌బొజ్జా తెలిపారు. చెన్నైకి తాగునీరు మాత్రమే సరఫరా చేయాలని, సాగునీటి అవసరాలకు తరలించడం అక్రమమని వాదించామన్నారు. ఏటా 200 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను ఏపీ బేసిన్ వెలపలి ప్రాంతాలకు తరలిస్తోందని అభ్యంతరం తెలిపారు. పోతిరెడ్డిపాడు, బనకచర్లతోపాటు ఏపీలోని మొత్తం 11 అవుట్ లెట్ల ద్వారా తరలిస్తున్న ప్రతీ చుక్కను పక్కాగా లెక్కించడానికి 11 టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరామని రాహుల్ బొజ్జా తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి అనుమతి లేని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రస్తుతం వీటికి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ పరిధిలో ఉందని బదులిచ్చామన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా నీళ్లు కేటాయించిందని, దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను కేటాయించుకునే హక్కు తమకు ఉంటుందన్నారు. సాగర్‌పై సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించాలని తాము కోరగా, ఏపీ సైతం అంగీకరించిందని రాహుల్‌బొజ్జా తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పరిశీలించాక 2 నెలల తర్వాత ఉపసంహరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారన్నారు. కృష్ణా జలాల్లో వాటాలు తేలే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని తమ కాంపోనెంట్లతోపాటు హైడల్ పవర్ ప్రాజెక్టులను ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదంలో శ్రీశైలం జలాశయం : తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్ (నీళ్లు స్పిల్‌వే గేట్ల నుంచి దూకి కిందకు పడే ప్రాంతం) వద్ద 300–400 మీటర్ల లోతు వరకు భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయాలని ఏపీని కోరామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుకు రూ.6 కోట్లను భరిస్తామని తెలియజేశామన్నారు. ఈ ఏడాది 780 టీఎంసీల కృష్ణా జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే ఏపీ 500 టీఎంసీలు(76శాతం) వాడుకోగా, తెలంగాణ కేవలం 180 టీఎంసీలు మాత్రమే వాడిందన్నారు. ఏపీ అధిక వినియోగానికి తగ్గట్టూ తెలంగాణకు వాటాలు పెంచాలని కోరామని చెప్పారు. బచావత్ కేటాయింపులకు రక్షణ కల్పించాలి : ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర్లు బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) కేటాయింపుల ఆధారంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకి 34 శాతం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరామని ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్–2లో వాటాలు తేలే వరకు ఈ మేరకు కేటాయింపులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చేవరకు త్రిసభ్య కమిటీ పరస్పర అంగీకారంతో నీళ్లను పంచుకుంటామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుపై తమ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్‌కు మరమ్మతుల కోసం సీఎస్ఎంఆర్ఎస్ఈతో అధ్యయనం చేయిస్తున్నామని, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అధికారులతో చర్చించి మరమ్మతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని డిమాండ్ చేశారు. -
అంగీకరించకపోతే పక్కన పెట్టేస్తాం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు రాష్ట్రా లన్నీ సమ్మతి తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కోరారు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్రాలు నాలుగేళ్లుగా నాన్చుడు వైఖరిని అవలంబిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లు గడిచినా ప్రాజెక్టు ముందుకు కదలదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలు సహకరించకపోతే ప్రాజెక్టును పక్కనపెట్టక తప్పదని తేల్చి చెప్పారు. రాష్ట్రాలన్నింటికీ సాధ్యమైనంత గరిష్టంగా నీటి కేటాయింపులు చేశామని, ప్రాజెక్టు ద్వారా 148 టీఎంసీలే తరలిస్తున్నందున కేటాయింపులు పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని కూడా చెప్పారు. నదుల అనుసంధానంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ఆమె మాట్లాడారు. నెలాఖరులోగా రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధిపతులతో ఢిల్లీలో ప్రత్యక్ష విధానంలో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించాలని ఎన్‌డబ్ల్యూడీఏకు దేబశ్రీ సూచించారు. జనవరిలో అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. తెలంగాణకు 50% కోటా ఇవ్వలేం..ప్రాజెక్టు ద్వారా తరలించనున్న 148 టీఎంసీల్లో 50 శాతం తమకు కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌ను దేబశ్రీ తోసిపుచ్చారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించడానికి బదులు సమ్మ క్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలనే తెలంగాణ ప్రతి పాదనలను పరిశీలి స్తున్నామని చెప్పారు. సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉండే నీళ్లను మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగంగా తరలించాలని, ఆ మేరకు నీటి లభ్యతను తేల్చడానికి సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలన్న రాష్ట్రం సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో రెండు కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని రాష్ట్రం చేసిన మరో ప్రతిపాదనకు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్ డీడీ సుబ్రమణ్యం ప్రసాద్ మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చిన తర్వాతే నాగార్జునసాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకోవాలని చెప్పారు. తక్కువ భూసేకరణ చేసేలా ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను రూపొందించాలని కోరగా దేబశ్రీ అంగీకరించారు. పోలవరం నుంచి అనుసంధానం సాధ్యం కాదుపోలవరం ప్రాజెక్టు నుంచి నదుల అనుసంధానం చేపట్టాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని దేబశ్రీ తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలిస్తే ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి మాత్రమే లబ్ధి పొందుతాయని, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భాగస్వామ్యం కోల్పోతాయని స్పష్టం చేశారు. ఏపీ భూభాగం పరిధిలో రెండు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకకు కోటా పెంచలేం..తమ రాష్ట్ర భూభాగంలో మాత్రమే జరగనున్న బెడ్తి–వార్దా నదుల అనుసంధానం ప్రాజెక్టును గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు పరిధి నుంచి తొలగించాలని కర్ణాటక చేసిన విజ్ఞప్తిపై దేబశ్రీ ముఖర్జీ సానుకూలంగా స్పందించారు. గోదావరి–కావేరి ప్రాజెక్టులో కర్ణాటకకు 16 టీఎంసీల తాగునీరు మాత్రమే కేటాయించారని, సాగునీరును సైతం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. తాము ఇప్పటికే సమ్మతి తెలుపుతూ ఎంఓయూపై సంతకాలు చేశామని తమిళనాడు, పుదుచ్చేరిలు తెలిపాయి. తమ రాష్ట్రం సొంతంగా చేపట్టిన దామన్‌గంగా–వైతర్ణ–గోదావరి నదుల అనుసంధానాన్ని గోదావరి–కావేరి ప్రాజెక్టు కింద చేర్చాలని మహారాష్ట్ర విజ్ఞప్తి చేసింది. -
జీవో 69 ఇక చెల్లుబాటు కాదు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల ఆపరేషనల్ ప్రోటోకాల్ ప్రకటిస్తూ 1996లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 ఇకపై చెల్లుబాటు కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టుల నీటి అవసరాలకు కొత్త ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను ట్రిబ్యునల్ రూపొందించాల్సి ఉంటుందని పేర్కొంది. రెండు రాష్ట్రాలకు జరిపే తుది నీటికేటాయింపుల ఆధారంగా వీటిని తయారు చేయాలని తెలిపింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట శుక్రవారం జరిగిన వాదనల్లో తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చేతన్ పండిట్ ఏపీ తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కృష్ణాబోర్డు రూపొందించిన ముసాయిదా రూల్ కర్వ్ ఆధారంగా ఆపరేషనల్ ప్రొటోకాల్ తయారు చేయరాదని తెలంగాణ పేర్కొంది. -
నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టుకు జాతీయ హోదా
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులు లేకుండా.. 29.9 టీఎంసీల తుంగభద్ర జలాలను వాడుకోవడానికి కర్ణాటక సర్కార్ చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వడంలో, జాతీయ హోదా కల్పించడంలో కేంద్ర జల్ శక్తి శాఖ వ్యవహరించిన తీరును దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో లేవనెత్తాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్ ఆయకట్టుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయని వివరించనున్నాయి. రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే అనుమతి తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన 295 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోవడానికి వీల్లేదని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తే.. 1980–81 నాటికే 319.558 టీఎంసీలను కర్ణాటక వినియోగిస్తున్నట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే తేల్చింది. కానీ.. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీలు మిగిలాయని, 65 శాతం లభ్యత ఆధారంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు) కేటాయించిన పది టీఎంసీలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించిన గోదావరి జలాలకుగానూ దక్కిన 21 టీఎంసీల్లో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 బేసిన్లలో మిగిలిన 6 టీఎంసీలు వెరసి.. 29.9 టీఎంసీలు (ఆవిరి నష్టాలు పోనూ) తరలించేలా అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక ప్రతిపాదించింది. అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి ఇవ్వాలంటే.. బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ అభిప్రాయం తీసుకోవాలి. కానీ.. ఈ రాష్ట్రాల అభిప్రాయం తీసుకోకుండానే 2020, డిసెంబర్ 24న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక అనుమతి ఇచ్చేసింది. విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికకీరణ వల్ల నీళ్లు మిగల్లేదని.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు ఎలా అనుమతి ఇస్తారని ఏపీ, తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను సీడబ్ల్యూసీ తోసిపుచ్చింది. సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. అప్పర్ భద్రను 2018–19 ధరల ప్రకారం రూ.16,125 కోట్లతో చేపట్టేందుకు 2021, మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనపై ఆ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.12,500 కోట్లను అందించడానికి కేంద్రం సమ్మతించింది. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర ఇబ్బందులే.. అప్పర్ భద్ర పూర్తయితే.. తుంగభద్ర డ్యామ్‌కు, శ్రీశైలానికి వరద ప్రవాహం రావడంతో మరింత జాప్యం జరుగుతుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దిగువకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉండదు. ఇది తుంగభద్ర డ్యామ్‌పై ఆధారపడిన ఏపీలోని ఆయకట్టుతోపాటు కృష్ణా బేసిన్లో తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. -
కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నీటిపారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీల (ఎస్సార్బీసీకి 19, చెన్నై తాగునీటికి 15)ను మాత్రమే వాడుకుంటేనే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు నీటిని పంపిణీ చేయాలని సోమవారం కృష్ణాబోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 34 టీఎంసీల కంటే అధికంగా వాడుకుంటే.. కృష్ణాజలాల్లో ఏపీ, తెలంగాణలకు చెరిసగం పంపిణీ చేయాలని.. ఇదే అంశాన్ని గత సమావేశంలో ప్రస్తావించినా వాటిని మినిట్స్‌లో పేర్కొనలేదని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 6న జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరడంపై నిపుణులు నివ్వెరపోతున్నారు. ‘బచావత్’ కేటాయింపులే ఆధారం బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా ఉమ్మడి రాష్ట్రానికి చేసిన 811 టీఎంసీల కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015, జూన్ 19న కేంద్రం తాత్కాలిక ఒప్పందం కుదుర్చింది. దీనిపై అటు తెలంగాణ.. ఇటు ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. 2015–16, 2016–17 సంవత్సరాల్లో ఇదే పద్ధతిలో కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. 2017, నవంబర్ 4న జరిగిన బోర్డు సమావేశంలో.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు ప్రతిపాదించాయి. దాంతో.. ఆ పద్ధతి ప్రకారమే 2017–18, 2018–19, 2020–21, 2021–22లలో కృష్ణాబోర్డు నీటిని పంపిణీ చేసింది. ఏమిటీ వితండ వాదన.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిన బచావత్ ట్రిబ్యునల్.. వాటాగా దక్కిన జలాలను రాష్ట్రంలో ఎక్కడైనా వినియోగించుకునే స్వేచ్ఛనూ ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కూడా కొనసాగించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమల్లో ఉంది. ఇక వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ట్రిబ్యునల్ కేటాయింపుల ద్వారా హక్కుగా దక్కిన జలాలను.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవాతోపాటు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ వాడుకోవడం తప్పెలా అవుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చినా.. కృష్ణా జలాల్లో ఏపీ వాటా ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులకు వాస్తవాలు తెలిసి కూడా వితండవాదనకు దిగడాన్ని వారు తప్పుపడుతున్నారు. -
'అప్ప'నంగా.. ఇదేందప్పా?
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులే లేకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇవ్వడాన్ని సమర్థించుకునేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అవాస్తవాలను వల్లె వేస్తోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ గత నెల 6న నిర్వహించిన హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–1) ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పును ఇప్పటిదాకా నోటిఫై చేయని నేపథ్యంలో అప్పర్ భద్రకు సాంకేతిక, పెట్టుబడి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అప్పర్ భద్రను నిలుపుదల చేసి తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలకు సమాధానం ఇవ్వకుండా, కర్ణాటకను సమర్థిస్తూ సీడబ్ల్యూసీ ప్రాజెక్టు అప్రైజల్(సౌత్) విభాగం డైరెక్టర్ ఎన్.ముఖర్జీ ఈనెల 12న జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ నెల 25న దీన్ని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి జల్ శక్తి శాఖ పంపింది. ఈ నేపథ్యంలో మరోసారి లేఖ రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అసలు ఏపీ అభ్యంతరాలు, సీడబ్ల్యూసీ వివరణ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం... ► ఏపీ సర్కార్ అభ్యంతరం–1: విజయనగర చానళ్లు, తుంగ, భద్ర ఆనకట్టల ఆధునికీకరణ వల్ల 11.5 టీఎంసీల నీటి వినియోగం తగ్గిందని కర్ణాటక చెబుతున్న లెక్కలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే కొట్టిపారేసింది. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అప్పర్ భద్రకు బ్రిజేష్ ట్రిబ్యునల్ 9 టీఎంసీలు కేటాయించినా ఆ తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు. అప్పర్ భద్ర హైడ్రాలజీపై పునఃసమీక్షించాలి. ► సీడబ్ల్యూసీ సమాధానం: బచావత్ ట్రిబ్యునల్ ఆధారంగానే అప్పర్ భద్రకు సాంకేతిక అనుమతి ఇచ్చాం. ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం అంశాన్ని సాంకేతిక అనుమతి ఇచ్చేటప్పుడు పరిశీలించాం. ► ఏపీ సర్కార్: అప్పర్ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని బచావత్ ట్రిబ్యునల్‌ను కర్ణాటక సర్కార్ కోరింది. తుంగభద్రలో నీటి లభ్యత లేనందున అప్పర్ భద్రకు నీటిని కేటాయించేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. విజయనగర చానళ్లు, భద్ర, తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని ట్రిబ్యునలే తేల్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అప్పర్ భద్రకు ఇచ్చిన హైడ్రలాజికల్ క్లియరెన్స్ తప్పు. దాన్ని పునఃసమీక్షించాలి. ► ఏపీ సర్కార్ అభ్యంతరం–2: మాస్టర్ ప్లాన్ తయారీకి కర్ణాటక సర్కార్ 2002లో నియమించిన కమిటీ తుంగభద్రలో ఆరు టీఎంసీలు మిగులు ఉందని తేల్చింది. కానీ ఆ ఆరు టీఎంసీలను అటు బచావత్గానీ ఇటు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌గానీ కర్ణాటకకు కేటాయించలేదు. ► సీడబ్ల్యూసీ: ఆరు టీఎంసీలు మిగులు జలాలు కాదు. కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో భాగమే. కే–8, కే–9 సబ్ బేసిన్లలో చిన్న నీటివనరుల విభాగంలో ఉపయోగించుకోని ఆరు టీఎంసీలను అప్పర్ భద్రకు కేటాయించామని కర్ణాటక సర్కార్ పేర్కొంది. ► ఏపీ సర్కార్: కే–8, కే–9 సబ్ బేసిన్లలో చిన్న నీటివనరుల విభాగంలో నీటి వినియోగం తగ్గిందన్న కర్ణాటక వాదనపై శాస్త్రీయ అధ్యయనం చేశారా? అక్కడ నీటి వినియోగం పెరిగిందేగానీ తగ్గలేదు. ► ఏపీ సర్కార్ అభ్యంతరం–3: బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర డ్యామ్‌కు 230 టీఎంసీలను కేటాయించింది. కానీ తుంగభద్ర డ్యామ్‌కు 1976–77 నుంచి 2007–08 వరకూ ఏటా సగటున 186.012 టీఎంసీలే వచ్చాయి. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్‌కు ప్రవాహం మరింత తగ్గిపోతుంది. ఇది కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తుంది. శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతుంది. ► సీడబ్ల్యూసీ: కర్ణాటక సర్కార్ 2019 నవంబర్ 27న జారీ చేసిన జీవో 176 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో 21.50 టీఎంసీలు, గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం వచ్చే అదనపు నీటిలో 2.4 టీఎంసీలు, కే–8, కే–9 సబ్ బేసిన్లలో మిగిలిన ఆరు టీఎంసీలు వెరసి 29.90 టీఎంసీలతో అప్పర్ భద్రను చేపట్టినందున దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగదు. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు ఒక్క చుక్క కూడా కేటాయించలేదు. అలాంటప్పుడు 21.5 టీఎంసీలు ఎక్కడ నుంచి వచ్చాయి? సబ్ బేసిన్లలో ఆరు టీఎంసీల మిగులు లేదు. కర్ణాటక కట్టుకథలనే సీడబ్ల్యూసీ వల్లె వేయడం ధర్మం కాదు. ► ఏపీ అభ్యంతరం–4: వేదవతిపై వాణీవిలాసాగర్, బీటీపీ(భైరవానితిప్ప ప్రాజెక్టు)ల మధ్య కొత్తగా ఎలాంటి ప్రాజెక్టు చేపట్టకూడదని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీన్ని తుంగలో తొక్కుతూ అప్పర్ భద్రలో అంతర్భాగంగా పరశురాంపుర వద్ద బ్యారేజీని కర్ణాటక నిర్మిస్తోంది. ► సీడబ్ల్యూసీ: 2020 డిసెంబర్ 24న నిర్వహించిన సాంకేతిక సలహా మండలి సమావేశం దృష్టికి పరశురాంపుర బ్యారేజీ నిర్మాణం రాలేదు. అప్పర్ భద్ర డీపీఆర్‌లో కూడా ఆ బ్యారేజీ విషయం లేదు. ► ఏపీ సర్కార్: అప్పర్ భద్ర ప్రాజెక్టులో అంతర్భాగంగా పరశురాంపుర బ్యారేజీ నిర్మిస్తున్నట్లు కర్ణాటక సర్కార్ టెండర్లు పిలిచింది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ► ఏపీ అభ్యంతరం–5: అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయం కచ్చితంగా తీసుకోవాలి. అప్పర్ భద్ర డీపీఆర్‌లను మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకు పంపకుండానే అనుమతి ఇచ్చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కాదా? ► సీడబ్ల్యూసీ: బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పర్ భద్రకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పరివాహక ప్రాంత రాష్ట్రాల అభిప్రాయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్రకు చుక్క నీటిని కూడా కేటాయించలేదు. నీటి కేటాయింపులేని ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం నిబంధనలను తుంగలో తొక్కడం కాదా? ► ఏపీ అభ్యంతరం–6: అప్పర్ భద్రకు జాతీయ హోదా ప్రతిపాదనపై చర్చించేందుకు డిసెంబర్ 6న నిర్వహించిన హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నీటి వాటాలు, హైడ్రాలజీ గురించి వెల్లడించారు. అంతర్రాష్ట్ర వివాదాలతో ముడిపడిన ఈ ప్రాజెక్టు విషయంలో పరివాహక రాష్ట్రాలకు ముందే సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ► సీడబ్ల్యూసీ: హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశం మినిట్స్ ఇంకా రావాల్సి ఉంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగానే అప్పర్ భద్రకు అనుమతి ఇచ్చాం. ► ఏపీ సర్కార్: బచావత్ ట్రిబ్యునల్ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను తోసిపుచ్చిన నేపథ్యంలో ఆ ట్రిబ్యునల్ తీర్పును పరిగణనలోకి తీసుకుని అనుమతి ఇచ్చామనడం విడ్డూరం. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాల్సిందే. ఇదీ అప్పర్ భద్ర ప్రాజెక్టు.. అప్పర్ భద్రకు నీటిని కేటాయించాలన్న కర్ణాటక విజ్ఞప్తిని 1976లోనే కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చింది. అయితే మాస్టర్ ప్లాన్, ఆధునికీకరణ, కృష్ణా డెల్టాకు పోలవరం మళ్లింపు జలాల్లో వాటా, పునరుత్పత్తి జలాలు, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాలు తదితరాల రూపంలో తమకు 30.4 టీఎంసీల లభ్యత ఉందని కర్ణాటక పేర్కొంది. ఇందులో ప్రవాహ, ఆవిరి నష్టాలు పోనూ 29.90 టీఎంసీలను అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని ప్రకటించింది. ► అప్పర్ తుంగ నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి అక్కడి నుంచి 29.90 టీఎంసీలను తరలించి దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందిస్తామని పేర్కొంది. ► ఈ ప్రాజెక్టుకు 2014 నుంచి 2019 వరకూ రూ.4,830 కోట్లను ఖర్చు చేసిన కర్ణాటక సర్కార్ అనుమతి కోసం సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపింది. ► 2020 డిసెంబర్ 24న ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో అప్పర్ భద్రకు రూ.16,125.48 కోట్లతో (2018–19 ధరల ప్రకారం) పెట్టుబడి అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు గతేడాది మార్చి 25న జల్‌శక్తి శాఖ ఆమోదముద్ర వేసింది. ► ఈ రెండు అనుమతుల ఆధారంగా దుర్భిక్ష ప్రాంతాల్లో 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించే అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించి 90 శాతం నిధులు (రూ.14,512.94 కోట్లు) ఇవ్వాలని కేంద్రానికి కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపై గత డిసెంబర్ 6న జల్ శక్తి శాఖ హైపవర్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించింది. -
శ్రీశైలంలో ఆగని తెలంగాణ దందా
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేయకూడదంటూ కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా తుంగలో తొక్కుతోంది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేయకూడదని కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తోంది. నీటి సంవత్సరం ప్రారంభం నుంచే (జూన్ 1 నుంచి) ఎడమ గట్టు కేంద్రంలో అక్రమంగా నీటిని వాడుకుంటూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన అటు తెలంగాణ, ఇటు ఏపీకి సంబంధించి తక్షణ సాగు, తాగునీటి అవసరాలు లేవు. ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరమూ లేదు. కానీ.. తెలంగాణ సర్కార్ అదేమీ పట్టకుండా ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటోంది. దీంతో దిగువకు వదిలేసిన జలాలు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. కొద్దిపాటి నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న నీటినంతటినీ గేట్లు ఎత్తేసి దిగువకు వృథాగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా జూన్ 1 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 162.76 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం. వాటా నీటిని దక్కనివ్వకుండా.. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 12న వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆ రోజున 884.4 అడుగుల్లో 211.96 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అదే రోజున సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయిలో 589.5 అడుగుల్లో 311 టీఎంసీల నిల్వ ఉంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 878.40 అడుగుల్లో 180.28 టీఎంసీలకు తగ్గిపోయింది. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాలను వాడుకోనివ్వకుండా చేయడానికే తెలంగాణ సర్కార్ కావాల్సిగా విద్యుదుత్పత్తి చేస్తోందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచీ ఇదే తీరు ► శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే అంటే జూన్ 2న 808.5 అడుగుల్లో 33.43 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రొటోకాల్ ప్రకారం కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు. ► కానీ.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే దిగువన ఎలాంటి సాగు, తాగునీటి అవసరాలు లేకపోయినా జూన్ 2న తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. తెలంగాణ సర్కార్ అక్రమ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ► ‘శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటిని తరలించవచ్చు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు.. చెన్నైకి తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ సర్కార్ తీరుతో ప్రాజెక్టులో నీటి నిల్వ 854 అడుగుల కంటే తగ్గిపోతే, కేటాయింపులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులకు నీటిని అందించలేము’ అని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు స్పష్టంగా వివరించింది. ► దీంతో తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డులు ఆదేశించాయి. అయినా సరే.. తెలంగాణ సర్కార్ ఖాతరు చేయకుండా రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ► ఈ పరిస్థితిలో న్యాయ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 27న జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించింది. -
పరిశీలన రద్దు చేసుకోండి
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం మరో మారు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తుండటం, రాష్ట్రం లేవనెత్తిన అభ్యంతరాలు పరిష్కరించకపోవడంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిశీలన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలంటూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఆదివారం కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులను తనిఖీ చేయకుండా నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలిస్తామనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు పరిధిని, వర్కింగ్ మాన్యువల్ నోటిఫై కాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ప్రాజెక్టు పరిశీలన బృందంలో ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన తటస్థులు ఉండాలని, ప్రస్తుత సభ్యులపై మాకు కొన్ని అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టుల పరిశీలన కంటే ట్రిబ్యునళ్ల తీర్పులు, విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను పరిశీలించాలన్న విషయాన్ని ముందుగా కృష్ణా బోర్డులో చర్చించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా కరోనా... తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోన్న విషయాన్ని కృష్ణా బోర్డు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. శనివారం ఏపీలో 7,000కుపైగా కొత్త కేసులు నమోదు కాగా, తెలంగాణలో 5,000 కేసులు నమోదయ్యాయని, కొత్త కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. సీమ ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కరోనా బారిన పడ్డారని, ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టు పరిశీలన సూచించదగ్గ నిర్ణయం కాదన్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించే వరకు పర్యటన రద్దు చేసుకోవాలని లేఖలో శ్యామలరావు కోరారు. -
లెక్క చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి వస్తున్న ప్రవాహాలు, వినియోగిస్తున్న నీటి వివరాలను సమర్పిస్తున్నట్లే బేసిన్‌లోని ఉపనదుల్లో నీటి వినియోగ లెక్కలను తెలపాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి స్పందన కరువైంది. ఉప నదుల నీటి ప్రవాహాలపై స్పష్టత ఉంటేనే నీటి కేటాయింపులు, వినియోగం లెక్కలు పారదర్శకంగా ఉంటాయని తెలిపినా రెండు రాష్ట్రాలు ఇంతవరకు వివరాలు సమర్పించలేదు. త్రిసభ్య కమిటీ భేటీ అనివార్య కారణాలతో వాయిదా పడటంతో ఈ అంశం పై చర్చ జరగలేదు. దీంతో మరోసారి లేఖ రాయాలని బోర్డు భావిస్తోంది. దీంతోపాటే కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో గత 20 ఏళ్లుగా 1989 నుంచి 2019వరకూ ఏటా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల్లోకి వచ్చిన వరద, వినియోగించుకున్న జలాలు, దిగువకు విడుదల చేసిన ప్రవాహాల లెక్కలు సమర్పించాలని కోరినా స్పందన రాలేదు. ఈ వివరాలిస్తే, మిగులు జలాల లెక్కలు తేల్చుతామని చెప్పినా రాష్ట్రాలు స్పందించకపోవడంతో వారం క్రితం ఈ వివరాలు కోరుతూ రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖ రాసింది. దీనిపైనా స్పందన లేకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న బోర్డు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్న యోచనలో ఉంది. -
నీటి లెక్కలు చెప్పండి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోకి వస్తున్న ప్రవాహాలు, వినియోగిస్తున్న నీటి వివరాలను అందజేసినట్లే ఉపనదుల్లోని నీటి లెక్కలను ఎప్పటికప్పుడు తెలపాలని రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఈఎన్సీలను కృష్ణా బోర్డు ఆదేశించింది. తద్వారా నీటి కేటాయింపులు, వినియోగం లెక్కలు పారదర్శకంగా ఉంటాయని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా మంగళవారం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాశారు. ► భైరవవానితిప్ప ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీ (గోదావరి నుంచి మళ్లించిన నీటి వివరాలు), తెలుగుగంగ ప్రాజెక్టు (టీజీపీ), తుంగభద్ర హెచ్చెల్సీ.. ఎల్లెల్సీ, గాజులదిన్నె ప్రాజెక్టు, మున్నేరు ప్రాజెక్టుల నుంచి వినియోగిస్తున్న నీటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఏపీ ఈఎన్సీని బోర్డు కోరింది. ► ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం), ఓకచెట్టివాగు ప్రాజెక్టు, కోటిపల్లివాగు ప్రాజెక్టు, డిండి, మూసీ, పాలేరు ప్రాజెక్టులలోకి వస్తున్న ప్రవాహాలు, నీటి వినియోగం లెక్కలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలంగాణ ఈఎన్సీ కోరింది. ► నీటి వినియోగం లెక్కలను ఎప్పటికప్పుడు తెలపడం వల్ల ఇరు రాష్ట్రాల వాటాల మేరకు నీటిని కేటాయిస్తామని, ఇది పారదర్శకంగా ఉంటుందని పేర్కొంది. -
ఏపీకి 17 ... తెలంగాణకు 37.67 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు 37.672, ఆంధ్రప్రదేశ్‌కు 17 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నై తాగునీటి సరఫరా, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు అవసరాల కోసం 9, హంద్రీ–నీవాకు ఎనిమిది టీఎంసీలను ఏపీకి కేటాయించింది. తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 7.746, నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాలువ, ఏఎమ్మార్పీకి 22.186, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, మిషన్ భగీరథకు 7.740 టీఎంసీలను కేటాయించింది. కేటాయించిన నీటి కంటే అదనంగా వినియోగించుకోకుండా ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు బాధ్య త తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు బుధ వారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టులో తాగు, సాగునీటి అవసరాల కోసం హంద్రీ–నీవాకు 8, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 9 టీఎంసీలు విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు ఏపీ, 37.672 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ లేఖలు రాశాయి. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న బోర్డు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో సోమవారం నాటికి కనీస నీటి మట్టానికి ఎగువన 110.440 టీఎంసీలు ఉన్నట్లు లెక్క కట్టింది. వాటిలో ఏపీ, తెలంగాణ ప్రతిపాదించిన మేరకు నీటిని కేటాయించింది. ఇక గతేడాది వినియోగించుకోకుండా మిగిలిపోయిన వాటా నీటిని ఈ ఏడాది విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే ముగుస్తాయని.. మిగులు నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో కృష్ణా బోర్డు పేర్కొంది. -
ప్రతి ఏడాది అన్యాయమే..!
సాక్షి, పులివెందుల రూరల్ : పులివెందుల ప్రాంత రైతులకు ప్రాణాధారమైన పులివెందుల బ్రాంచ్ కాలువకు తుంగభద్ర డ్యాం నుంచి రావాల్సిన 4.4 టీఎంసీల నీటి విడుదల విషయంలో ఈసారి కూడా రైతులకు నిరాశ మిగిలింది. కర్ణాటకలోని తుంగభద్ర నది నుంచి పులివెందుల ప్రాంతంలో ఉన్న సీబీఆర్‌కు ప్రతి ఏడాది 4.4 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ ప్రతి సంవత్సరం హెచ్ఎల్సీ అధికారులు అరకొరగా నీటిని విడుదల చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయలేదు. ఈ ఏడాది 4.4 టీఎంసీలకుగానూ.. 3.172 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. ఆ నీరు ఇప్పటివరకూ విడుదల చేయలేదు. గత ఏడాదిలో కర్ణాటకలో బాగా వర్షాలు పడి తుంగభద్ర డ్యాంకు వరద నీటితో కళకళలాడింది. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నా అధికారులు పులివెందుల ప్రాంత రైతులపై పక్షపాత ధోరణి అవలంభిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీటి కేటాయిపుల్లో అన్యాయం.. ప్రతి ఏడాది సీబీఆర్‌కు నీటి కేటాయింపులలో అన్యాయం జరుగుతూనే ఉంది. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు అప్పులు చేసి సాగు చేసిన పంటలు పండక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రబీలో సాగు చేసిన ధనియాలు, జొన్న, బుడ్డశనగ, వేరుశనగ పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. గత ఏడాది ఆగస్టులో అనంతపురంలో జరిగిన సాగునీటి సలహా కమిటీ ఇరిగేషన్ అడ్వయిజరీ సమావేశంలో పీబీసీకి 3.172 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తీర్మానం చేశారు. కానీ ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదు. పీబీసీ కింద 50 వేల ఆయకట్టు.. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా పీబీసీ కాలువ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పీబీసీకి 35ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఒక్కసారి (2014–15)మాత్రమే పూర్తి నీటిని విడుదల చేశారు. సీబీఆర్ నీటి కేటాయింపులో ప్రతి ఏడాది తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నుంచి హెచ్ఎల్సీ కాలువ ద్వారా మిడ్ పెన్నార్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసి అక్కడ నుంచి సీబీఆర్‌కు నీటిని విడుదల చేస్తారు. సీబీఆర్ ద్వారా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్టుకు పైపుల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాదైనా సీబీఆర్‌కు రావాల్సిన 4.4టీఎంసీల నీటిని వచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు పేర్కొంటున్నారు. సీబీఆర్‌కు విడుదలైన నీటి కేటాయింపులు.. -
నీటి కేటాయింపుల తీరుపై తెలంగాణ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్రానికి దక్కే వాటాకన్నా తక్కువ నీటి కేటాయింపులు చేసిందని శనివారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా బోర్డు తెలంగాణకు 46.90 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 33.40 టీఎంసీలు కేటాయించిందని, అయితే న్యాయంగా తెలంగాణకు 51 టీఎంసీల మేర వాటా నీరు దక్కుతుందని తేల్చిచెప్పింది. ఇక బోర్డు సాగర్ ఎడమ కాల్వ కింద ఆంధ్రప్రదేశ్ అవసరాలకు 3.43 టీఎంసీల నీరు కేటాయించిందని, నిజానికి సాగర్ ఎడమ కాల్వ కింద ప్రస్తుత రబీ సీజన్లో జోన్–1 వరకు మాత్రమే నీటిని అందించాలని తెలంగాణ భావిస్తోందని తెలిపింది. సరిపడేంత నీరు లేక తెలంగాణలోని జోన్–2 ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదని వివరించింది. అలాంటప్పుడు జోన్–3లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఆయకట్టుకు నీరు తీసుకెళ్లడం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
కట్టి వదిలేశారంతే!
పెద్దపప్పూరు: మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో ఉన్న ముచ్చుకోట రిజర్వాయర్‌ను ప్రారంభించి దాదాపు 30 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు నీటి కేటాయింపులు లేవు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు దాని గురించే పట్టించుకోకపోవడంతో అది శిథిలావస్థకు చేరుకుంది. మండలంలోని ముచ్చుకోట రిజర్వాయర్‌ను అప్పట్లో దాదాపు రూ.కోటి వ్యయంతో నిర్మించారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దీనిని ప్రారంభించారు. దీనికోసం దాదాపు 300 ఎకరాలు సేకరించారు. నార్పల మండలం తుంపెర డెలివరీ పాయింట్ నుంచి సుబ్బరాయసాగర్‌కు, అక్కడి నుంచి ముచ్చుకోటకు నీరు వస్తుంది. ఇది నిండితే పెద్దపప్పూరులోని ముచ్చుకోట, వరదాయపల్లి, చిక్కేపల్లి, నామనాంకపల్లి, షేక్‌పల్లి గ్రామాలతోపాటు పుట్లూరు మండలంలోని పలు గ్రామాలకు భూగర్భజలాలు పెరిగి తాగునీరు, సాగునీరు అందుతుంది. కానీ నీరన్నదే లేక నిరుపయోగంగా మారడంతో రిజర్వాయర్ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇప్పటికే రాతిబండింగ్(రాతికట్టడం) కృంగిపోయింది. రిజర్వాయర్‌కు నీరు చేరే కాలువ కూడా దెబ్బతింది. ముళ్లపొదలతో నిండిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలానే వదిలేస్తే ఇది ఎందుకూ పనికి రాకుండా పోతుందని మండలంలోని ఆయా గ్రామాల రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. శ్రీశైలం డ్యామ్‌కు నిండా నీరు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరు విడుదల చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. నీరు విడుదల చేయాలి రిజర్వాయర్ నిర్మించినప్పటి నుంచి నీటి కేటాయింపులు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన నిర్మాణం ఎందుకూ ఉçపయోగపడకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీరివ్వాలి. – మల్లికార్జున, ముచ్చుకోట -
ఏపీకి 18.5, తెలంగాణకు 17.5
-ఇరు రాష్ట్రాల ఖరీఫ్ అవసరాల దృష్ట్యా నీటి విడుదలకు బోర్డు నిర్ణయం -ఎడమ కాల్వ కింద లెలంగాణకు 15 టీఎంసీ, హైదరాబాద్, నల్లగొండ తాగునీటికి 2.5టీఎంసీ -పోతిరెడ్డిపాడు కింది అవసరాలకు 11 టీఎంసీ -ఇందులో చెన్నై తాగునీటికి 3 టీఎంసీ -ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాగు, తాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం చేసింది. అక్టోబర్ అవసరాలకు గానూ తెలంగాణకు 17.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం చేసింది. ఈ మేరకు నీటి కేటాయింపులపై తన నిర్ణయాన్ని తెలియజేస్తూ బుధవారం ఇరు రాష్ట్రాలకు బోర్డు లేఖలు రాసింది. సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ కోసం 30.20 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.10టీఎంసీలు కలిపి మొత్తంగా 40.30టీఎంసీలు అవసరం ఉంటాయని ఆగస్టు నెలలో తెలంగాణ బోర్డును కోరింది. ఇందులో 15 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు గతంలోనే అనుమతులిచ్చింది. అనంతరం మళ్లీ తెలంగాణ సాగర్ ఎడమ కాల్వ కింద జోన్-1, జోన్-2లోని ఖరీఫ్ సాగు అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించాలని మరో లేఖ రాసింది. ఇదే సమయంలో టగత 28, 30 తేదీల్లో ఏపీ తనకు పోతిరెడ్డిపాడు కింద 11 టీఎంసీలు, హంద్రీనీవా కింద 5 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద మరో 2.50 టీఎంసీలు కావాలని విన్నవించింది. ఈ వినతులను పరిశీలించిన బోర్డు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుధ్దంగా ఇరు రాష్ట్రాలు నీటిని విడుదల చేశారో తెలుపుతూనే, ప్రస్తుత కేటాయింపులు జరిపింది. మూడు చోట్ల వాటాకు మించి వినియోగం.. కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు తెలంగాణ ఏఎంఆర్పీ కింద 10.21టీఎంసీ, ఎడమ కాల్వ కింద 5.131టీఎంసీ, కల్వకుర్తి కింద 1.745 టీఎంసీలు కలిపి మొత్తంగా 17.087టీఎంసీ వినియోగించుకోగా, ఏపీ పోతిరెడ్డిపాడు కింద 23.79టీఎంసీ, సాగర్ కుడి కాల్వ కింద 9.989, కృష్ణా డెల్టా సిస్టమ్ కింద 20.413, హంద్రీనీవా కింద 9.33టీఎంసీలు కలిపి మొత్తంగా 63.524 టీఎంసీలు వినియోగించారని బోర్డు లేఖలో వివరించింది. గత ఆగస్టులో ఇచ్చిన ఆదేశాలకు విరుధ్దంగా పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఏఎంఆర్పీ కింద వాటాకు మించి వినియోగం చేశారని లేఖలో పేర్కొంది. అధికం వాడుంటే వీటిని వాడరాదు.. ప్రస్తుత రాష్ట్రాల వినతులను దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవాకు 5 టీఎంసీ, చెన్నై తాగునీటికి 3, ఎస్ఆర్బీసీ 3, తెలుగుగంగ ప్రాజెక్టు 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.50 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏపీకి 18.50 టీఎంసీలు విడుదలకు బోర్డు అంగీకారం తెలిపింది. ఇక తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీ, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.50టీఎంసీలు కలిపి 17.50 టీఎంసీల వినియోగానికి అంగీకారం తెలిపింది. ప్రస్తుతం జరిపిన కేటాయింపులు గత ఆగస్టు నెలలో పేర్కొన్న నీటి కేటాయింపులకు అదనమని, అప్పటి ఆదేశాల్లో పేర్కొన్న దాని కంటే అధికంగా వినియోగం చేసుంటే ప్రస్తుత నీటిని వాడటానికి అవసకాశం ఉండదని, తక్కువగా వినియోగించి ఉంటే మిగిలిన నీటిని వినియోగించుకోవచ్చని లేఖలో స్పష్టం చేసింది. ఏ రాష్ట్రమైనా అధికంగా నీటిని వాడుకొని ఉంటే ఆ రాష్ట్రం త్రిసభ్య కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించింది. ప్రస్తుతం చేసిన కేటాయింపులను ఆయా రాష్ట్రాలు అదే అవసరాలకు వాడుతున్నాయా? లేక ఇతర ప్రాధాన్యాత అవసరాలకు వాడకుంటున్నాయా? అన్నది ఆయా రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు గమనిస్తూ ఉండాలని తెలిపింది. -
'ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించం'
హైదరాబాద్: బానిసత్వాన్ని చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించమని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మీకు చేతనైతే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించకుండా చూడండని హితవు పలికారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై తెలంగాణ టీడీపీ నేతలు స్పందించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
బాబు అనుభవం ఉన్న నాయకుడనుకున్నా: హరీష్
తాండూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవగాహన, అనుభవం ఉన్న నాయకుడనుకున్నా..కానీ, కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి ఉమాభారతికి ఆయన లేఖ రాయడం చూస్తే అది తప్పని రుజువైందని తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీటి కేటాయింపుల విషయంలో బాబు చెబుతున్న మాటల్లో నిజాయితీ లేదని హరీష్ ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు ఆపేందుకు చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు తినే అన్నంలో మట్టికొట్టేందుకు కుట్రలు పన్నుతున్న చంద్రబాబు తెలంగాణ ద్రోహని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సర్కారు ఇష్టానుసారంగా మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 89 అమలు కాకుండా సెక్షన్ 87 ఉత్పన్నం కాదని హరీష్ స్పష్టం చేశారు. తెలంగాణకు 389 టీఎంసీలు రావాల్సి ఉందని..బచావత్ అవార్డు అమలుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బచావత్ ప్రకారం అయితే రాయలసీమకు చుక్క నీరు కూడా రాదని...ఈ సమస్యను సత్వరమే పరిష్కారించాలని కేంద్రాన్ని కోరినట్టు హరీష్‌రావు చెప్పారు. -
'నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం'
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రానికి 950 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో ఉదయం చర్చ జరిగింది.