
శ్రీవారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేత
తిరుమల: ఈనెల 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ప్రారంభమైంది. ఆలయ శుద్ధి చేసే కార్యక్రమం ఉదయం 11 గంటల వరకు జరుగుతుంది. శుద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
అంతవరకూ స్వామివారి దర్శనాన్ని నిలిపివేస్తున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(శుద్ధి) కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, ఈవో ఇతర అధికారులు, పూజారులు పాల్గొంటున్నారు. ఆణివార ఆస్థానం కారణంగా అష్టాదళపాదపద్మారాధన సేవ నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.