నగరంలోని చిట్టినగర్ రోడ్డు విస్తరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
విజయవాడ: నగరంలోని చిట్టినగర్ రోడ్డు విస్తరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విస్తరణ పనుల కోసం అధికారులు అమ్మవారి ఆలయాన్ని తొలగించడానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు, దేవాలయ కమిటీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డు విస్తరణ చేయాల్సిందే అని మున్సిపల్ అధికారులు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురు స్థానికులను అదుపులోకి తీసుకున్నారు.