కౌంటర్ దాఖలు చేయని అధికారిపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కౌంటర్ దాఖలు చేయడానికి పలుమార్లు గడువు ఇచ్చినా స్పందించని కేంద్ర ఆర్థికశాఖకేంద్ర ఆర్థికశాలోని రెవెన్యూ విభాగపు కార్యదర్శికి రూ.10వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గతేడాది జారీ చేసిన పన్ను విధింపు ఉత్తర్వులను సవాలు చేస్తూ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన హైకోర్టు... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఆర్థికశాఖలోని రెవెన్యూ విభాగపు కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 1కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణ చేపట్టిన ధర్మాసనం.. తమ ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది బి.నారాయణరెడ్డిని నిలదీసింది.
దీంతో ఆయన కౌంటర్ దాఖలుకు మరింత గడువు కావాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణకు కౌంటర్ దాఖలు చేసి తీరాలని, లేనిపక్షంలో రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందంటూ విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. తిరిగి 13న విచారణకు వచ్చిన నాటికి కూడా రెవెన్యూ విభాగపు కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయలేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం కేంద్ర రెవెన్యూ విభాగ కార్యదర్శికి రూ.10 వేల జరిమానా విధించింది.
కేంద్ర రెవెన్యూ కార్యదర్శికి జరిమానా
Published Sun, Oct 18 2015 3:01 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement