శ్రీకాకుళం అర్బన్: నూతన పెన్షన్ విధానం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టదాయకమని ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. నూతన పెన్షన్ విధానం–పర్యావసానాలపై సెమినార్ అనే కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా పెన్షన్ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయన్నారు. ఈ విధానాల వల్ల పాతపెన్షన్ కూడా గ్యారెంటీ లేకుండా పోతుందని అన్నారు. కాబ ట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కలసికట్టుగా పో రాడి ప్రభుత్వం తన విధానాలను మార్చుకునేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొన్న ఈ సదస్సులో గరిమెళ్ల అధ్యయనవేదిక కన్వీనర్ ఎస్.కిషోర్‌కుమార్, ఉద్యోగ సంఘ నాయకుడు కె.శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘ నాయకులు గొంటి గిరిధర్ పాల్గొన్నారు.
‘కొత్త పింఛన్ విధానంతో నష్టమే’
Published Tue, Feb 7 2017 6:57 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM
Advertisement