చీరాల: ప్రకాశం జిల్లా దర్శి, పామూరు, పొదిలి, పర్చూరు, సంతనూతలపాడు ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి సి.పెద్దిరెడ్డి తెలిపారు. చీరాల అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.
చీరాల అగ్నిమాపక కేంద్రం శిథిలావస్థకు చేరిందని, నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన నివేదికలను పంపించామని చెప్పారు. ప్రస్తుతం ఒక ఫైర్‌ఇంజన్, మిస్ట్ వాహనం ఉన్నాయన్నారు. దర్శిలో రెండెకరాలు స్థలం అగ్నిమాపక కేంద్రానికి కేటాయించామన్నారు. అగ్నిమాపక శాఖ సూచించిన నియమాలు పాటించిన సినిమా హాల్స్, షాపింగ్‌మాల్స్, కల్యాణమండపాలపై దృష్టి సారించామని తెలిపారు. అటువంటి వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. ఆయన వెంట చీరాల అగ్నిమాపక అధికారి కె.సునీల్‌కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.
నూతన ఫైర్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
Published Thu, Jun 9 2016 5:09 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement
Advertisement