సమ్మెతో ‘వారసత్వం’ సాధించలేరు
టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు
శ్రీరాంపూర్: జాతీయం సంఘాలు సమ్మె చేయడం వల్ల వారసత్వ ఉద్యోగాలు సాధించలేవని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు అన్నారు. సోమవారం ఆర్కే–5బీ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సమ్మె ద్వారా నే ఉద్యోగాలు వస్తాయంటే 18 ఏళ్ల నుంచి ఎందుకు చేయలేదని జాతీయ సంఘాలను ప్రశ్నించారు.
సమ్మె పేరుతో కార్మికులను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. వారసత్వ ఉద్యోగాలపై ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్ మొసలి కన్నీరు కారుస్తున్నాయన్నారు. వారసత్వంపై హైకోర్టులో ఇంప్లీడ్ అయిన ఈ సంఘాలు వారి న్యాయవాదులతో వాదనలు ఎందుకు వినిపించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐక్యంగా ఉండి సమ్మె చేస్తామని చెప్తూనే ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌లు గనులపై ఒకరినొకరు తీవ్రంగా తిట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ సంఘాలు కార్మికుల ఓట్ల కోసమే ఈ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా వారసత్వ ఉద్యోగాలను ఎలా ఇవ్వాలనే దానిపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని వివరించా రు. కార్మికుల చిరకాల వాంఛ సొంతింటి పథకం కూడా అమలు చేస్తామన్నారు. సమావేశంలో ఆ యూనియన్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాయకులు బంటు సారయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, జి.మహిపాల్‌రెడ్డి, మంద మల్లారెడ్డి, సీహెచ్ అశోక్, వీరభద్ర య్య, రాఘవరెడ్డి, నాయకులు అద్దు శ్రీనివాస్, గంగయ్య, నెల్కి మల్లేశ్, నీలం సదయ్య, లక్ష్మ ణ్, మిట్ట సుధాకర్, సత్యనారాయణ పాల్గొన్నారు