ఏటీఎం యంత్రం పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేసిన సంఘటన పట్టణంలోని వీడీ రోడ్డులో చోటు చేసుకుంది.
హిందూపురం అర్బన్: ఏటీఎం యంత్రం పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేసిన సంఘటన పట్టణంలోని వీడీ రోడ్డులో చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు కార్పొరేషన్ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం కేంద్రం షెట్టర్ తాళాలు వేయకుండా మూసి ఉండటంతో అందులో ప్రవేశించి ఏటీఎం డోరును గుణపం, కొడవలితో కొట్టి తెరిచారు. తర్వాత పటిష్టంగా ఉన్న క్యాష్‌బాక్సు డోరు విఫలయత్నం చేసినా తెరవలేకపోయారు. గుణపం, రాడుతో డోర్‌ను బెండ్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఆ సమయంలో రోడ్డులో నుంచి పోలీస్ విజిల్ వినిపించడంతో దొంగలు అక్కడి నుంచి పరారీ అయ్యారు. విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. బ్యాంక్ అధికారులు వచ్చి పరిశీలించి క్యాష్‌బాక్స్ తెరుచుకోలేదని నిర్ధరించుకున్నారు. ఈ మేరకు టూటౌన్lపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.