
స్వాధీనం చేసుకున్న నోట్లతో పోలీసులు
నెల్లూరు పోలీసుల అదుపులో ముగ్గురు
నెల్లూరు(క్రైమ్): పాతనోట్లను మార్చేందుకు యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను నెల్లూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్ కింగ్స్‌కోర్ట్ అపార్ట్‌మెంట్‌లో వ్యాపారి వేమూరు నరహరిరెడ్డి నివాసముంటున్నాడు. అతని వద్ద రూ. 50 లక్షలు పాత వెయ్యిరూపాయల నోట్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అతనికి మన్సూర్‌నగర్‌కు చెందిన కొత్తూరు శ్రీనివాస్, నరసింహకొండకు చెందిన కుర్రా శ్రీకాంత్‌రెడ్డితో పరిచయమైంది. తమకు సగం డబ్బులిస్తే వాటిని మారుస్తామని వారు చెప్పగా నరహరి అంగీకరించాడు. ఈ క్రమంలో నరహరెడ్డి ఇంట్లో పాతనోట్లు మార్చుకుంటున్నారని నాల్గోనగర ఇన్‌స్పెక్టర్ సీతారామయ్యకు సమాచారమందింది. ఆయన ఈ విషయాన్ని నగర డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లు నరహరిరెడ్డి ప్లాటుపై దాడిచేసి రూ. 50 లక్షల పాతనోట్లను స్వాధీనం చేసుకొని ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.