ముగ్గురి ఆత్మహత్య
Published Thu, Sep 22 2016 12:50 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
కైకరం(ఉంగుటూరు) : వేర్వేరు చోట్ల బుధవారం ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.. పెంటపాడు మండలం పడమర విప్పరుకు చెందిన వాలిపల్లి రాజారావు (45)కు 20ఏళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల నుంచి భార్యా, పిల్లలు అతనికి దూరంగా ఉం టున్నారు. దీంతో మానసికంగా కుంగి పోయిన అతను వారం క్రితం తన సోదరి బొమ్మిడి సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. మంగళవారం సోదరి ఇంటివద్ద పురుగు మందు తాగి మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ..
ఏలూరు అర్బన్ : స్థానిక జ్యూట్‌మిల్ ప్రాంతంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జాన్సన్ కథనం ప్రకారం.. ఓవర్‌బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని బుధవారం స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే హెచ్‌సీ జాన్సన్ మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతుని గురించి స్థానికులను విచారించినా ఎలాంటి సమాచా రం లభించలేదు. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం బాగా ఛిద్రమైంది. మృతుడు నల్లరంగు గళ్లు కలిగిన లేత బిస్కెట్ రంగు పొడవు చేతుల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వయసు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండొచ్చని, వివరాలు తెలిసిన వారు 9491362001 నంబరు కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఉరేసుకుని యువకుడు మృతి
మొగల్తూరు : గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మొగల్తూరు స్టేషన్ పరిధి సీతారామపురంలో జరి గింది. ఎస్‌ఐ డి.జె.రత్నం కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కర్ల చందు (25) కొంత కాలంగా సీతారామపురంలో పొక్లెయిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇక్కడే గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన గదికి వెళ్లిన చందు బుధవా రం ఉదయం ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు పగలగొట్టారు. దీంతో అతను ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వీఆర్వో కురెళ్ళ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement