ఘర్షణ కేసుకు సంబంధించి రామసుబ్బమ్మ, జగదీష్, బాబులను వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ప్రొద్దుటూరు క్రైం: ఘర్షణ కేసుకు సంబంధించి రామసుబ్బమ్మ, జగదీష్, బాబులను వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాకీ విషయమై గత నెల 9న సార్వకట్టవీధికి చెందిన నల్లబోతుల పుల్లయ్య, అదే వీధిలో ఉంటున్న జగదీష్ తదితరులు పరస్పరం గొడవ పడ్డారు. దీంతో పరస్పర ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘర్షణ కేసుకు సంబంధించి శుక్రవారం ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.