అనంతపురం సెంట్రల్ : అంనతపురం పాతూరులోని మున్నానగర్‌కు చెందిన ఆయేషా, మహబూబ్‌బాషా దంపతుల కుమారుడు ఇమ్రాన్(3) ఆదివారం అదృశ్యమయ్యాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయట ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. సాయంత్రం వరకు ఆచూకీ దొరక్కపోవడంతో వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐలు రమణ, నాగమధు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.