అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ప్రిన్సిపల్ కార్యదర్శి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో కలెక్టర్‌తో పాటు డీఈఓ, పోలీసు, వైద్యం, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. పెన్నార్ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొంటారు.