వర్కూరులో ధరలేక పొలంలోనే వదిలేసిన టమాట దిగుబడి
టమా‘ఠా’
Published Wed, Dec 28 2016 10:24 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- మార్కెట్లో 20 కిలోల టమాట గంప రూ.30
కోడుమూరు రూరల్: టమాట రైతులను ధర వెక్కిరిస్తోంది. 20కిలోల టమాట గంప ధర మార్కెట్లో రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది. కనీసం పంట తెంపిన కూలీల ఖర్చు కూడా రాకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొందరు రైతులు పంటను దున్నేస్తుండగా, మరికొందరు పశువులకు, జనాలకు వదిలిపెడుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలోని వర్కూరుకు చెందిన రైతు శేషిరెడ్డి ఎకరా పొలంలో టమాట సాగు చేశాడు. పంట దిగుబడి వచ్చినప్పటి నుంచి ధర లేకపోవడంతో దిక్కుతోచక పొలంలోనే రాసిగా పోసి వదిలేశాడు.
పంటనంతా దున్నేశా
రూ.30వేల పెట్టుబడితో ఎకరా పొలంలో టమాట సాగు చేసినా. దిగుబడి వచ్చినప్పటి నుంచి 20 కిలోల గంప రూ.40లకు మించి పోని పరిస్థితి. కనీసం టమాట తెంచిన కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కావడం లేదు. చేసేది లేక వారం రోజుల క్రితం పంటనంతా దున్నించేసినా.
- రైతు శివరాముడు, వర్కూరు
Advertisement
Advertisement