రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చందానగర్ గ్రామం రైల్వే గేటు వద్ద సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చందానగర్ గ్రామం రైల్వే గేటు వద్ద సోమవారం ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. మృతుడు మెదక్‌జిల్లా పటాన్‌చెరువు మండలం రుద్రారం గ్రామ వాసిగా గుర్తించారు. వెంకటేష్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.