ట్రాఫిక్ తిప్పలు బాబోయ్
Published Wed, Aug 17 2016 5:04 PM | Last Updated on Fri, May 25 2018 7:04 PM
పట్నంబజారు (అమరావతి): కృష్ణా పుష్కరాల్లో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి పర్యటనలో భక్తులు, ప్రయాణికులు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సీఎం ఉదయం 10 గంటలకే అమరావతి చేరుకుంటారని అధికారులు ప్రకటించంతో పోలీసులు 8గంటల నుంచే హడావుడి మొదలుపెట్టారు. పూర్తిస్థాయిలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టడంతో భక్తుల తిప్పలు అన్నీఇన్నీ కావు. అమరేశ్వరస్వామి ఆలయం ప్రధాన రహదారి, క్రోసూరు రోడ్డును సైతం బ్యారికేడ్లు పెట్టి మూసివేశారు. ధ్యానబుద్ధ రోడ్డులో సీఎం కాన్వాయ్ ఉండటంతో రోడ్లలన్నింటిని మూసివేశారు. ఘాటులో అరగంటకు పైగా ఉన్న చంద్రబాబు అక్కడ నుంచి నమూనా ఆలయాలను సందర్శించారు. ప్రధాన రహదారిలో కాన్వాయ్ ఉండటంతో భక్తులను నడవనివ్వలేదు. సుమారు రెండు కిలోమీటర్ల మేర బస్సులు, ఆటోలు, వాహనాలు నిలిచిపోవటంతో చంటి బిడ్డలను ఎత్తుకుని మరీ భక్తులు ఘాట్లకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది.
ట్రాఫిక్ సమస్యలు బాబాయ్!
Advertisement
Advertisement