డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
ఎచ్చెర్ల: గిరిజన యువతకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నైపుణ్యం కేంద్రం అసిస్టెంట్ మేనేజర్ టి.చాముండేశ్వరరావు తెలిపారు. మంగళవారం 21వ శతాబ్ది గురుకులం నైపుణ్యం కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆసక్తి గల గిరిజన యువత, ఇతర కులాల వారు సైతం ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. 8వ తరగతి ఉత్తీర్ణత, 19 ఏళ్లు నిండిన వారు అర్హులని చెప్పారు. హెవీ వెహికల్ శిక్షణకు 10వ తరగతి ఉత్తీర్ణులై 20 ఏళ్లు నిండి ఉండాలని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విజయనగరంలో రెసిడెన్సియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఎచ్చెర్ల సమీపంలోని 21వ శతాబ్ది గురుకులం సప్రదించాలని ఆయన సూచించారు.