అక్టోబర్‌ 17నుంచి మహాజన పాదయాత్ర | Tramp on october 17th | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 17నుంచి మహాజన పాదయాత్ర

Published Thu, Sep 15 2016 10:49 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

అక్టోబర్‌ 17నుంచి మహాజన పాదయాత్ర - Sakshi

అక్టోబర్‌ 17నుంచి మహాజన పాదయాత్ర

మిర్యాలగూడ : అక్టోబర్‌ 17వ తేదీ నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర వ్యాప్తంగా మహాజన పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిలా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ  సాయుధ పోరాట యోధులు కోరుకున్న తెలంగాణ కోసం పాదయాత్ర నిర్వహిం చనున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపేట నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలు, మండలాల్లో సుమారుగా నాలుగు నెలల పాటు 5,500 నుంచి ఆరు వేల కిలో మీటర్ల మేరకు కొనసాగనుందన్నారు. సెప్టెంబర్‌17న తెలంగాణ  విలీన దినోత్సవాన్ని అన్నిగ్రామాల్లో నిర్వహించాలని రంగారెడ్డి పిలుపునిచ్చారు. సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారికి నివాళులర్పించాలని కోరారు. అదేవిధంగా సాయుధపోరాటంలో పాల్గొన్న వారికి సన్మానాలు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్, డివిజన్‌ కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి జగదీశ్‌చంద్ర, నాయకులు మల్లుగౌతమ్‌రెడ్డి, మహ్మద్‌బిన్‌ సయ్యద్, రామ్మూర్తి, గొర్ల ఇంద్రారెడ్డి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement