సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో బుధవారం నీటిలో మునిగి ఇద్దరు చనిపోయారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో బుధవారం నీటిలో మునిగి ఇద్దరు చనిపోయారు. తుర్కపల్లి గ్రామం పెద్దమ్మ కుంటలో ఈతకు వెళ్లిన పండరి(15) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. అలాగే, నిజాంపేట్ మదిర్యాల చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన బీటి వెంకయ్య(21) నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వీరికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.