గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
పార్వతీపురం : స్థానిక నర్శిపురం–పార్వతీపురంల మధ్య రైల్వేలైన్‌లోని విద్యుత్ స్తంభానికి గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే హెచ్‌సీ నిమ్మకాయల భాస్కరరావు తెలిపారు. ఆదివారం ఉదయం దాదాపు 40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. మతుడు చామనఛాయ రంగులో ఉన్నాడని తెలిపారు. గోధుమ రంగు షర్ట్, నీలం ఆకుపచ్చ తెలుపు గడుల లుంగీ ధరించాడని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.