చేయూతనిస్తే సత్తా చాటుతాం
నిరుపేద కుటుంబంలో పుట్టిన క్రీడా కుసుమాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పల్లె నుంచి పొరుగు దేశంలో జరిగే ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనప్పటికీ అక్కడికి వెళ్లే స్తోమత లేక ఆందోళన చెందుతున్నారు. దాతలు చేయూతనిస్తే పోటీల్లో సత్తా చాటుతామంటున్నారు.
-
సాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద క్రీడాకారులు
ఏటూరునాగారం : నిరుపేద కుటుంబంలో పుట్టిన క్రీడా కుసుమాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పల్లె నుంచి పొరుగు దేశంలో జరిగే ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనప్పటికీ అక్కడికి వెళ్లే స్తోమత లేక ఆందోళన చెందుతున్నారు. దాతలు చేయూతనిస్తే పోటీల్లో సత్తా చాటుతామంటున్నారు. మండల కేంద్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారులు సయ్యద్ రియాజ్, ఎండి. ఖయూమ్ మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు జరిగిన అండర్ –19 క్రికెట్ ఫస్ట్ యూత్ గేమ్స్ జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ జట్టు తర ఫున పాల్గొని ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వాహకులు వీరిని నేపాల్‌లో ఈ నెల 25 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే సౌత్ ఏషియన్ క్రికెట్ పోటీలకు భాతర జట్టు తరపున ఎంపిక చేశారు. అయితే నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరికి నేపాల్ వెళ్లేందుకు ప్రయాణ, ఇతర ఖర్చులకు డబ్బు లేక మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే పోటీల్లో పాల్గొని సత్తాచాటుతామంటున్నారు. సయ్యద్ రియాజ్‌కు సాయం చేసేవారు 8500178436, ఎండి. ఖయూమ్‌కు సాయం చేసేవారు 9912613312 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.