ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రాంపుర్, రామకృష్ణాపూర్, గోలేటి ఓపోన్ బొగ్గు గనుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దండేపల్లి, మంచిర్యాల, చెన్నూరు, లక్సెట్టిపేట ప్రాంతాల్లో ఆరు బయట ఉంచిన ధాన్యం తడిసిపోయింది.